MS Dhoni Assets: ఎంఎస్ ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

తన జీవితంపై బాలీవుడ్‌లో తీసిన ఎంఎస్‌ ధోని : అన్‌టోల్డ్‌ స్టోరీ ద్వారా లాభాల్లో ధోని రూ.30 కోట్లు తీసుకున్నాడు. చెన్నై అభిమానులతో ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరుచుకున్న ధోని.. తమిళ చిత్ర సీమలో నిర్మాతగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే ధోని అక్కడ ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ను స్టార్ట్‌ చేసి వరుసగా సినిమాలు తీసేందుకు సన్నాహకాలు చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా ప్రస్తుతం సెట్స్‌లో ఉంది.

  • Written By: Raj Shekar
  • Published On:
MS Dhoni Assets: ఎంఎస్ ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

MS Dhoni Assets: భారత క్రికెట్‌ జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ సారథి మహేంద్ర సింగ్‌ ధోని నేడు 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ధోని.. చిన్నప్పుడు సగటు మధ్య తరగతి భారతీయ యువకులు అనుభవించిన కష్టాలన్నీ అనుభవించాడు. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న ధోని క్రీడల కోటాలో ఖరగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో టికెట్‌ కలెక్టర్‌(టీసీ)గా ఉద్యోగం చేశాడు. ఇరుకు గదుల్లో అద్దెకు ఉన్న ధోని ఆస్తులు ఇప్పుడు ఎంతో తెలుసా..?

కోట్లకు అధిపతి..
కొన్ని నివేదికల ప్రకారం మహేంద్రుడి ఆస్తుల విలువ రూ. 1,040 కోట్లు. క్రికెటర్‌గా ఉన్నప్పుడు సంపాదించుకున్న ఆస్తులతోపాటు ధోని చాలాకాలంగా పలు వ్యాపారాలలో కూడా భాగమయ్యాడు. బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్స్, ఐపీఎల్‌ సాలరీ, పెట్టుబడుల రూపంలో మహేంద్రుడి సంపాదన నానాటికీ పెరుగుతోంది.

ఐపీఎల్‌ వేతనం రూ.12 కోట్లు..
ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధోనికి వార్షిక వేతనం రూ.12 కోట్లు (గతంలో రూ. 15 కోట్ల దాకా తీసుకునేవాడు. కానీ 2022లో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకునేందుకని వేతనాన్ని తగ్గించుకున్నాడు) గా ఉంది.

బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్స్‌ ద్వారా..
అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుని సుమారు మూడేళ్లు గడుస్తున్నా దోని మార్కెట్‌ పడిపోలేదు. ఇప్పటికీ కోహ్లీ తర్వాత భారత క్రికెట్‌ లో అత్యధిక ఎండార్స్‌మెంట్స్‌ కలిగిన క్రికెటర్‌ ధోనీనే.. కోకో కోలా, డ్రీమ్‌ 11, గో డాడీ, రీబాక్, ఓరియో, గల్ఫ్‌ ఆయిల్, ఇండియా సిమెంట్స్, కోల్గెట్‌ సియారమ్, టీవీఎస్, ఒప్పో కు ధోనినే బ్రాండ్‌ అంబాసిడర్‌..

పెట్టుబడులు..
బ్రాండ్స్‌ ఎండార్స్‌మెంట్స్‌తోపాటు పాటు పలు వ్యాపారాలలో కూడా ఎంట్రీ ఇస్తున్న ధోని.. ఖాతా బుక్, కార్స్‌ 23, శాఖాహారితోపాటు కొద్దిరోజుల క్రితమే డ్రోన్స్‌ బిజినెస్‌లో కూడా దిగాడు. ప్రముఖ డ్రోన్‌ తయారీ సంస్థ గరుడా ఏరోస్పేస్‌లో ధోని పెట్టుబడులు పెట్టాడు. ఫిట్నెస్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే ధోనికి.. బ్రాండ్‌ సెవెన్‌లో కూడా పెట్టుబడులు పెట్టాడు.

పలు క్రీడా లీగ్‌లలోనూ..
ఫుట్‌బాల్‌కు వీరాభిమాని అయిన ధోనికి వ్యాపారాలతోపాటు ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో చెన్నయన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌కు ఓనర్‌గా ధోని ఉన్నాడు. హాకీలో రాంచీ రేస్, రేసింగ్‌ టీమ్‌ (మహీ రేసింగ్‌) కూడా ఉన్నాయి.

సినిమాల్లో..
తన జీవితంపై బాలీవుడ్‌లో తీసిన ఎంఎస్‌ ధోని : అన్‌టోల్డ్‌ స్టోరీ ద్వారా లాభాల్లో ధోని రూ.30 కోట్లు తీసుకున్నాడు. చెన్నై అభిమానులతో ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరుచుకున్న ధోని.. తమిళ చిత్ర సీమలో నిర్మాతగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే ధోని అక్కడ ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ను స్టార్ట్‌ చేసి వరుసగా సినిమాలు తీసేందుకు సన్నాహకాలు చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా ప్రస్తుతం సెట్స్‌లో ఉంది.

సాధారణ టికెట్‌ కలెక్టర్‌ ఉద్యోగ జీవితం ప్రారంభించిన ధోనీ క్రికెట్‌ కెరీర్‌తో స్టార్‌గా మారిపోయాడు. తర్వాత అనేక కంపెనీలకు బ్రాండ్‌గా మారాడు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. ఇలా ధోని ఎదుగుదలతోపాటు అతని ఆస్తులూ అంతకంతకు పెరుగుతున్నాయి.

Read Today's Latest Sports news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు