Mohan Babu Assets: మోహన్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
Mohan Babu Assets: తెలుగు చలన చిత్ర రంగంలో విలక్షణ నటుడు మోహన్ బాబు. తనదైన డైలాగులతో అందరిని మెప్పించే సత్తా ఆయన సొంతం. అందుకే ఆయనతో సినిమాలు చేసేందుకు అందరు ఉత్సాహం చూపుతారు. పదునైన మాటలతో ఎదుటి వారిని పడగొట్టే తత్వం ఆయనకే చెల్లు. నటుడుగా ఎంత సరదాగా ఉంటాడో నిర్మాతగా అంతే నిక్కచ్చిగా ఉంటాడు. సమయపాలన పాటించకపోతే ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తాడనేది తెలిసిందే. సొంతంగా తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ స్థాపించి ఎందరో పేద […]

Mohan Babu Assets: తెలుగు చలన చిత్ర రంగంలో విలక్షణ నటుడు మోహన్ బాబు. తనదైన డైలాగులతో అందరిని మెప్పించే సత్తా ఆయన సొంతం. అందుకే ఆయనతో సినిమాలు చేసేందుకు అందరు ఉత్సాహం చూపుతారు. పదునైన మాటలతో ఎదుటి వారిని పడగొట్టే తత్వం ఆయనకే చెల్లు. నటుడుగా ఎంత సరదాగా ఉంటాడో నిర్మాతగా అంతే నిక్కచ్చిగా ఉంటాడు. సమయపాలన పాటించకపోతే ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తాడనేది తెలిసిందే. సొంతంగా తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ స్థాపించి ఎందరో పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిస్తున్న ఘనత ఆయనదే. సామాజిక సేవలో కూడా ఆయనకు ఉత్సాహం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ఇండస్ర్టీలో ఓ మూవీ మేకర్ కమ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయ్యారు.

Mohan Babu
శ్రీ లక్ష్మీప్రసన్న బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ, మేజర్ చంద్రకాంత్ లాంటి చిత్రాలు తీసి ప్రేక్షకులను మెప్పించాడు. డైలాగులు చెప్పడంలో ఆయనకు లేరు పోటీ. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం తన ఇద్దరు కొడుకులు కూడా చిత్రాలు తీస్తూ తండ్రి పేరు నిలబెడుతున్నారు. మోహన్ బాబుది సిలోన్ వాయిస్ అని అందరు చెబుతుంటారు. ఆయన డైలాగ్ వర్షన్ అలా ఉంటుంది మరి.
Also Read: Samantha Tweet: సమంతను వేశ్య అన్న నెటిజెన్… ఆమె షాకింగ్ రిప్లై!
మోహన్ బాబు సంపాదన ఎంతో తెలిస్తే షాకే. నటుడు, నిర్మాతగానే కాకుండా పలు వ్యాపారాలు చేసి ఆయన ఆస్తులు కూడబెట్టినట్లు తెలస్తోంది. రూ.356 కోట్ల ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇంత భారీ మొత్తంలో ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆయనకు సినిమాలతో పాటు వ్యాపారాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఇంత భారీ మొత్తంలో ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది. సొంతూరులో రూ.3 కోట్ల విలువైన ఇల్లు కూడా ఉందని తెలిసిందే.

Mohan Babu
మోహన్ బాబు మొదట్లో నష్టాలు చవిచూసినా తరువాత కాలంలో పుంజుకుని లాభాల పంట పండించారు. దీంతో ఆయన ఆస్తుల విలువ అమాంతం పెరిగిపోయింది. దీంతోనే అంత మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ఒక్క సినిమాయే కాదు పలు వ్యాపారాలు చేయడంతో ఆస్తి పెరిగిందని చెబుతున్నారు. సినిమా పరిశ్రమలో ఎవరికి కూడా తక్కువ ఆస్తులు లేవు. అందరికి వందల కోట్లు ఉన్నట్లు తెలిసిందే. ఇదే కోవలో మోహన్ బాబుకు సైతం ఇంత ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read:Balakrishna- Chiranjeevi: బాలయ్యతో చిరంజీవి ఖాయమేనా?