Mahesh Babu On Memu Famous: ‘మేము ఫేమస్’ సినిమా కోసం మహేష్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!
ఈ చిత్రానికి ట్రైలర్ కారణంగా విడుదలకు ముందే ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి కానీ, సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడైతే ఈ చిత్రాన్ని చూసి ప్రశంసలతో ముంచి ఎత్తుతూ ట్వీట్ వేశాడో, అప్పటి నుండి ఈ సినిమా మీద ఉన్న హైప్ ఒక్కసారిగా పదింతలు ఎక్కువ అయ్యింది. అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో అదిరిపోయాయి. అయిపోతే మహేష్ బాబు అలా ట్వీట్ వెయ్యడానికి చాలా పెద్ద కారణం ఉందని అంటున్నారు నెటిజెన్స్..

Mahesh Babu On Memu Famous: చిన్న సినిమాలను ప్రోత్సహించడంలో ఎప్పటికీ ముందు ఉండే హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు.ఆయన ప్రోత్సహించిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్స్ గా నిలిచాయి. రీసెంట్ గా ఆయన ప్రోత్సహించిన మరో చిన్న చిత్రం ‘మేము ఫేమస్’. నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఓపెనింగ్స్ కూడా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చింది.
ఈ చిత్రానికి ట్రైలర్ కారణంగా విడుదలకు ముందే ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి కానీ, సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడైతే ఈ చిత్రాన్ని చూసి ప్రశంసలతో ముంచి ఎత్తుతూ ట్వీట్ వేశాడో, అప్పటి నుండి ఈ సినిమా మీద ఉన్న హైప్ ఒక్కసారిగా పదింతలు ఎక్కువ అయ్యింది. అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో అదిరిపోయాయి. అయిపోతే మహేష్ బాబు అలా ట్వీట్ వెయ్యడానికి చాలా పెద్ద కారణం ఉందని అంటున్నారు నెటిజెన్స్..
మహేష్ బాబు ఈ చిత్రానికి డబ్బులు తీసుకొని ప్రమోట్ చేసాడని, ఆ ఒక్క ట్వీట్ తో పాటుగా, ఆయన మీద అతి త్వరలోనే ఓకే డీజే సాంగ్ కూడా చిత్రీకరిస్తున్నారని, ఇందుకోసం ఆయన రెండు కోట్ల రూపాయలకు పైగానే మూవీ టీం నుండి రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అంటూ ప్రచారం చేసారు. సోషల్ మీడియా లో వచ్చిన ఈ వార్తపై ‘మేము ఫేమస్’ టీం స్పందించింది. మేము ఎదో చిన్నగా సార్ ని రిక్వెస్ట్ చేసుకుంటే వెంటనే ఓకే చెప్పాడు, అది కేవలం కొత్త టాలెంట్ ని ప్రోత్సహించాలి అనే మంచి మనసుతోనే ఈ పని చేస్తున్నాడు.
సోషల్ మీడియా లో వస్తున్నట్టుగా ఆయన ఇందుకోసం ఎలాంటి పారితోషికం తీసుకోలేదు అని చెప్పుకొచ్చారు. మా సినిమా బడ్జెట్ కూడా రెండు కోట్ల రూపాయిలు ఉండదని, అలాంటిది మేము మహేష్ బాబు కి రెండు కోట్ల రూపాయిలు ఎలా ఇచ్చుకోగలం, దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ చెయ్యకండి అంటూ రిక్వెస్ట్ చేసారు.