Nagineedu Remuneration: ‘మర్యాదరామన్న’ సినిమాలో చేసిన ఈయనకి ఇచ్చిన రెమ్యూనరేషన్ ఇచ్చారో తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!
జనాలు బాగా ఎంజాయ్ చేసారు, అప్పట్లోనే ఈ చిత్రం 35 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.ఇక ఈ సినిమాలో సునీల్ తర్వాత మంచి పేరు తెచ్చుకున్న నటుడు నాగినీడు.

Nagineedu Remuneration: దర్శక ధీరుడు రాజమౌళి కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ మరియు ఇండస్ట్రీ హిట్స్ ఉండొచ్చు. కానీ ఆయన కెరీర్ లో ఎంతో స్పెషల్ గా చెప్పుకునే సినిమా మాత్రం ‘మర్యాదరామన్న’. ‘మగధీర’ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రం తర్వాత రాజమౌళి కమెడియన్ సునీల్ ని పెట్టి ఈ చిత్రం తీసాడు.ఎప్పుడూ భారీ బడ్జెట్ మరియు మాస్ సినిమాలు చేసే రాజమౌళి, కాస్త ఆటవిడుపు కోసం కామెడీ జానర్ సినిమాని ఎంచుకున్నాడు.
జనాలు బాగా ఎంజాయ్ చేసారు, అప్పట్లోనే ఈ చిత్రం 35 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.ఇక ఈ సినిమాలో సునీల్ తర్వాత మంచి పేరు తెచ్చుకున్న నటుడు నాగినీడు. ‘రామ్ నీడు’ పాత్రలో ఆయన నటించలేదు, జీవించాడు అనే చెప్పాలి. రాయలసీమ పట్టింపులు, పగలు ఎలా ఉంటాయో తన నటన ద్వారా వెండితెర మీద ఆవిష్కరించాడు.
ఈ చిత్రం తర్వాత నాగినీడు కి సినిమాల్లో అవకాశాలు బాగానే వచ్చాయి.అయితే మర్యాదరామన్న సినిమా కోసం ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టక తప్పదు. ఆయన పారిటీషికం లక్షల్లో ఉందేమో అని అనుకుంటే పొరపాటే, ఆయన రెమ్యూనరేషన్ ఈ సినిమాకి తీసుకుంది కేవలం 1050 రూపాయిలు మాత్రమే అట. ఈ చిత్రాన్ని నేను డబ్బుల కోసం మాత్రం చెయ్యలేదని, కేవలం సినిమాల మీద మక్కువ, నన్ను కోట్లాది మంది ప్రేక్షకులు చూస్తారు అనే ఆశతో మాత్రమే ఈ చిత్రాన్ని చేశాను అంటూ చెప్పుకొచ్చాడు నాగినీడు.
ఒకప్పుడు ఏడాది కి కనీసం 10 సినిమాల్లో కనిపించే ఈయన, గత కొంత కాలం గా సినిమాలకు దూరం గా ఉంటూ వస్తున్నాడు. 2019 వ సంవత్సరం వరకు కెరీర్ లో పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేసిన నాగినీడు గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. భవిష్యత్తులో అయినా ఈయన తన పూర్వ వైభవం ని రప్పించుకుంటాడో లేదో చూడాలి.
