Mrunal Thakur: శ్రీలీల కి పోటీ ఇస్తున్న మృణాల్ ఠాకూర్.. ఒక్కో సినిమాకి ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా!

ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఏకంగా 10 సినిమాలు ఉన్నాయి. వాటిల్లో పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమాలు ఉన్నాయి. అలాగే చిరంజీవి, బాలయ్య వంటి సీనియర్ హీరోలు.

  • Written By: Vicky
  • Published On:
Mrunal Thakur: శ్రీలీల కి పోటీ ఇస్తున్న మృణాల్ ఠాకూర్.. ఒక్కో సినిమాకి ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా!

Mrunal Thakur: నిన్న గాక మొన్న వచ్చిన కొంతమంది హీరోయిన్స్ నేడు నిర్మాతలకు చుక్కలు చూపించేస్తున్నారు. అదృష్టం కొద్దీ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు , క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ రావడం వల్లే, వాళ్ళ డిమాండ్ కి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ అడుగుతున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ గా మారిపోయింది శ్రీలీల. పెళ్ళిసందడి చిత్రం తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె తొలిసినిమా తోనే ఎవరీ అమ్మాయి ఇంత బాగుంది, మెరుపు తీగలాగా డ్యాన్స్ చేస్తుంది.

చాలా చలాకీగా అల్లరిపిల్లలాగా చక్కగా నటిస్తుంది అని అందరూ అనుకున్నారు. ఆ సినిమా యావరేజి గా ఉన్నప్పటికీ అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం శ్రీలీలనే. ఈ చిత్రం తర్వాత ఆమె రవితేజ తో ధమాకా అనే చిత్రం లో నటించింది , ఇది క్లూడా బంపర్ హిట్ అవ్వడం, ఆ సినిమా అంత హిట్ అవ్వడానికి కారణం ప్రధానంగా ఆమె డ్యాన్స్ అవ్వడం తో మేకర్స్ ఇక శ్రీలీల తో సినిమాలు చేసేందుకు క్యూలు కట్టేసారు.

ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఏకంగా 10 సినిమాలు ఉన్నాయి. వాటిల్లో పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమాలు ఉన్నాయి. అలాగే చిరంజీవి, బాలయ్య వంటి సీనియర్ హీరోలు. నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ , రామ్ , నితిన్ లాంటి యంగ్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆమెకి పోటీ గా సీతారామన్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తయారు అయ్యింది. శ్రీలీల రేంజ్ లో ఆఫర్లు దక్కించుకోకపోయినా మేకర్స్ కి ఇప్పుడు శ్రీలీల తరువాతి ఛాయస్ గా మృణాల్ ఠాకూర్ నిలుస్తుంది. అయితే రెమ్యూనరేషన్ విషయం లో ఈ అమ్మాయి నిర్మాతలకు చుక్కలు చూపించేస్తుంది.

టాలీవుడ్ లో ఒక్కో సినిమా చేసేందుకు గాను, ఈమె ఆరు కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట. ఇది చాలా ఎక్కువ అని అంటున్నారు ట్రేడ్ పండితులు, ఎందుకంటే శ్రీలీల ఒక్కో సినిమాకి ప్రస్తుతం ఇప్పుడు మూడు కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఆమె రేంజ్ క్రేజ్ మరియు డిమాండ్ లేకపోయినా కూడా ఆమెకంటే రెండు రేట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చెయ్యడం సరికాదని అంటున్నారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు