Drinking Water: మంచినీళ్లు తాగడంలో పద్ధతులేంటో తెలుసా?
ఉదయం నిద్ర లేవగానే లీటరు పావు నీళ్లు తాగాలి. తరువాత మలవిసర్జన చేసిన తరువాత మళ్లీ ఓ లీటరు పావు తాగితే మంచిది. ఉదయం అల్పాహారం చేయక ముందు ఓ గ్లాసు నీళ్లు తాగాలి.

Drinking Water: మంచినీళ్లు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. దీంతో మనం రోజు నిద్ర లేచిన నుంచి పడుకునే వరకు నీళ్లు తాగుతుండాలి. ఒక మనిషి సగటున రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగాలి. నీళ్లు తాగే పద్ధతిలో కూడా సక్రమంగా ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు తాగితే ఇబ్బందులే. కొందరు తినేటప్పుడు నీళ్లు తాగుతుంటారు ఇది కరెక్టు కాదు. ఈ నేపథ్యంలో మంచినీళ్లు తాగే క్రమంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదు.
ఉదయం లేవగానే..
ఉదయం నిద్ర లేవగానే లీటరు పావు నీళ్లు తాగాలి. తరువాత మలవిసర్జన చేసిన తరువాత మళ్లీ ఓ లీటరు పావు తాగితే మంచిది. ఉదయం అల్పాహారం చేయక ముందు ఓ గ్లాసు నీళ్లు తాగాలి. తిన్న తరువాత గంటన్నర నుంచి ప్రతి అరగంటకోసారి గ్లాసు నీరు తాగుతూ ఉండాలి. ఇలా మనం నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
తినే సమయంలో..
కొందరు ఆహారం తినే సమయంలో నీళ్లు తాగుతుంటారు. ఇలా చేస్తే మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. మనం తినే పదార్థం జీర్ణం చేయడానికి లోపల యాసిడ్ విడుదల అవుతుంది. దీంతో మనం తాగే నీళ్లు యాసిడ్ తో కలిసి ఆహారం త్వరగా జీర్ణం కాకుండా చేస్తుంది. అందుకే తినేటప్పుడు నీళ్లు తాగితే జీర్ణం ఆలస్యం అవుతుంది. అన్నం తొందరగా అరగాలంటే నీళ్లు తాగకపోవడమే బెటర్.
నీళ్లు తాగడం
నీళ్లు తాగడం వల్ల తిన్న ఆహారాలు జీర్ణం కావడమే కాకుండా రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. అవయవాలకు మేలు చేస్తుంది. గుండె వేగాన్ని సరిచేస్తుంది. ఇలా నీళ్లు తాగడం వల్ల ఎన్నో అనారోగ్యాలు దూరం అవుతాయి. ఇలా నీళ్లు తాగడం క్రమం తప్పకుండా చేస్తే ఎలాంటి దుష్ర్పభాలు ఉండవని తెలుసుకోవాలి.
