
Sreeleela- Sai Pallavi
Sreeleela- Sai Pallavi: శ్రీలీల టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్. దర్శక నిర్మాతలు ఆమె వెంటపడుతున్నారు. ఇక్కడ చేసింది రెండు సినిమాలే అయినా పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారు. కన్నడ అమ్మాయి అయిన శ్రీలీల పెళ్లి సందD మూవీతో తెలుగులో అడుగుపెట్టారు. ఫస్ట్ మూవీతోనే తన లుక్స్, మెస్మరైజింగ్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. పెళ్లి సందD పర్లేదు అనిపించుకుంది. శ్రీలీల మాత్రం మేకర్స్ కంట్లో పడింది. రవితేజకు జంటగా ధమాకా చిత్రం చేసింది. గత ఏడాది విడుదలైన ధమాకా సూపర్ హిట్ కొట్టింది. భారీ వసూళ్లు రాబట్టింది. రెండు ప్లాప్స్ అనంతరం రవితేజకు ధమాకా రిలీఫ్ ఇచ్చింది.
ప్రస్తుతం శ్రీలీల మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 28 చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ కాగా, ఈమెది సెకండ్ లీడ్ హీరోయిన్. బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రంలో కీలక రోల్ చేస్తున్నారు. ఆమెది బాలయ్య కూతురు పాత్ర అని ప్రచారం జరుగుతుంది. అయితే అది నిజం కాదట. ఎన్బీకే 108లో ఆమెది ఓ కీలక రోల్ అని సమాచారం. బోయపాటి దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. నవీన్ పోలిశెట్టికి జంటగా అనగనగా ఒకరాజు మూవీలో నటిస్తున్నారు.
మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. కాగా స్టార్ హీరోయిన్ సాయి పల్లవితో శ్రీలీలకు కొన్ని కామన్ పాయింట్స్, లింక్స్ ఉన్నాయి. సాయి పల్లవి డాక్టర్ అన్న విషయం తెలిసిందే. జార్జియా దేశంలో సాయి పల్లవి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం నటిగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు. శ్రీలీల సైతం డాక్టర్. ఆమె ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. త్వరలో ఆమె తన డిగ్రీ పూర్తి చేయనున్నారు. బెంగుళూరులో ఆమె డాక్టర్ కోర్స్ చదువుతున్నారు.

Sai Pallavi
వీరిద్దరిలో మరో కామన్ పాయింట్ ఉంది. ఇద్దరూ మంచి డాన్సర్స్. సాయి పల్లవి ఎలాంటి డాన్స్ నేర్చుకోలేదు. మక్కువతో మాధురీ దీక్షిత్ వంటి హీరోయిన్స్ సాంగ్స్ ని టీవీలో చూసి నేర్చుకున్నారట. అలా ఆమె గొప్ప డాన్సర్ అయ్యారు. అయితే శ్రీలీల భరత నాట్యం నేర్చుకున్నారు. శ్రీలీల మూమెంట్స్ లో గ్రేస్ మెస్మరైజ్ చేస్తుంది. ఆ విధంగా శ్రీలీల-సాయి పల్లవి డాక్టర్స్ కావడమే కాకుండా మంచి డాన్సర్స్ కూడాను. ఈ యంగ్ బ్యూటీస్ మధ్య ఉన్న కామన్ పాయింట్స్ ఇవే.