Ayurveda: ఆయుర్వేదంలో చెట్లు ఎన్నో లాభాలు చేకూరుస్తాయి. ఇందులో వేప కూడా ఒకటి. వేపతో మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటయి. వేపలో ఉండే చేదుతో ఎన్నో రోగాలు దూరమవుతాయి. అందుకే ఆయుర్వేదంలో వేపను పలు రకాలుగా వినియోగించుకుంటాం. మధుమేహ నియంత్రణలో వేప ఆకు ఉపకరిస్తుంది. వేప ఆకును నమిలితే షుగర్ కంట్రోల్ అవుతుంది. వేప పుల్లతో పళ్లు తోముకుంటే ఎంతో లాభం. అందులో ఉండే చేదుతో మన నోరు శుభ్రంగా మారుతుంది. ఒక ఊరిలో 50 వేప చెట్లు ఉంటే ఎలాంటి వైరస్ కూడా ఆ ఊరి దరిచేరవు.

Ayurveda
ఉప్పు కూడా మనకు ఎంతో మేలు కలిగిస్తుంది. ఉప్పు నీళ్లు శానిటైజర్ గా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. పసుపు, ఉప్పుతో క్రిములు నాశనం అవుతాయి. ఉప్పు నీటితో చేతులు కడుక్కుంటే ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఆవు మూత్రంతో కూడా మనక ఆయుర్వేదంలో ఎన్నో ఔషధ గుణాలు కనిపిస్తాయి. గోమూత్రంతో ఇల్లును సంప్రోక్షణ చేసుకుంటే మంచిది. చాలా రకాల రోగాలకు గోమూత్రం మందులా పనిచేస్తుంది. ఆవు పిడకపై కొంచెం కర్పూరం వేసి కాలిస్తే ఆ పొగకు వైరస్ దరిచేరదు.
స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే సూక్ష్మజీవులు దూరం అవుతాయి. ఆవు మన సనాతన సంప్రదాయంలో గోమాతగా కొలవడం మామూలే. ఆవు పాలతో దేవుడికి అభిషేకం చేస్తే మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇలా ఆవుల వల్ల మనకు పలు రకాల ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆవు పేడతో కల్లాపి చల్లితే క్రమికీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇలా గోవుతో మనకు పలు లాభాలు కలుగుతాయి. ఈ నేపథ్యంలో ఆవు పాలతో ఎన్నో స్వీట్లు చేసుకుని తింటారు.

Ayurveda
ఆధునిక కాలంలో వచ్చే వైరస్ లకు మన ఇంట్లోనే వాటిని దూరం చేసే చిట్కాలు ఉన్న సంగతి కరోనా ద్వారా తెలిసింది. మన వంటింట్లోనే లభించే యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వంటివి మన దేహానికి ఆరోగ్యాన్ని ప్రసాదించేవే. ఇలా చెట్ల ద్వారా మనకు కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి. దీంతో చెట్ల పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చి వాటితో మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. రోగాలు మన దరి చేరకుండా చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని భావించుకోవాలి.