Tollywood Heroes On Bollywood: సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచమే కాదు. అత్యున్నత స్థాయికి ఎదగడానికి మంచి మార్గం. ఒక్క చాన్స్ వస్తే చాలు తన ప్రతిభను నిరూపించుకుంటామని చాలా మంది చిత్ర పరిశ్రమకు వస్తారు. ఇక్కడ సక్సెస్ కాగానే బాలీవుడ్లో అవకాశం వస్తే బాగుండు.. అని ట్రై చేస్తారు. ఇలా సౌత్ ఇండస్ట్రీల్లో రాణించిన చాలా మంది స్టార్లు బాలీవుడ్లో తమ సత్తా చాటాలని ప్రయత్నించారు. కానీ అందరూ రాణించలేకపోయారు. కొందరికి మాత్రం అదృష్టం వరించి పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు సాధించారు. వారెవరో చూద్దాం.

Rana, Vijay Devarakonda
రానా:
‘లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన రానా రెండో సినిమాకే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ‘ధమ్ మారో ధమ్’ అనే సినిమాలో అభిషేక్ బచ్చన్ తో కలిసి నటించారు. అయితే ఈసినిమా పెద్దగా రాణించలేదు. కానీ రానా మాత్రం ఆ తరువాత ఘాజీ, బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలే చేశారు. అయితే హీరోగా కాకున్నా ‘హే జవానీ హే దివానీ’ లాంటి సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసి ఆకట్టుకున్నారు.
విజయ్ దేవరకొండ:
విజయ్ నటించిన ‘అర్జున్ రెడ్డి’ని హిందీలో రీమేక్ చేశారు. ఆ తరువాత అసలైన హీరో విజయ్ అని తెలిశాక బాలీవుడ్ నుంచి ఈ యంగ్ హీరోకు ఫ్యాన్స్ పెరిగారు. ఆ తరువాత ఈయన సినిమాలన్నీ హిందీలో డబ్ చేయడంతో ప్రేక్షకులు ఆదరించారు. ఆయనకు వచ్చిన ఫాలోయింగ్ న దృష్టిలో పెట్టుకొని పూరిజగన్నాథ్ భారీ బడ్జెట్ పెట్టి ‘లైగర్’ తీశాడు. ఈ సినిమా డిజాస్టర్ గా మిలిగింది. ఈ ప్రభావం ఆయన నెక్ట్స్ మూవీపై పడింది.
నాగచైతన్య:
‘జోష్’ సినిమాతో తెరంగేట్రం చేసిన నాగచైతన్య హిట్టు ఫట్టు తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్ర పోషించి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో చైతూకు నిరాశే ఎదురైంది. అయితే ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఓ వెబ్ సిరీసులో నటిస్తున్నాడు.
రామ్ చరణ్:
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన రామ్ చరణ్ ‘మగధీర’ సినిమాతో బాలీవుడ్ హీరో అయిపోయాడు. దీంతో పోలీస్ ఆఫీసర్ గా ‘జంజీర్’ అనే సినిమా తీశారు. ఈ సినిమ ఆశించినంతగా ఫలితం రాలేదు. ఆ తరువాత దీనిని ‘తుఫాన్’ పేరుతో తెలుగులో రిలీజ్ చేసినా ఆకట్టుకోలేదు. దీంతో రామ్ చరణ్ బాలీవుడ్ జోలికి వెళ్లలేదు. అయితే ‘ఆర్ఆర్ఆర్’తో మళ్లీ ఈయన హవా పెరిగింది.

Naga Chaitanya, Ram Charan
నితిన్:
నితిన్ నటించిన చాలా సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నాయి. అయితే రాంగోపాల్ వర్మ తో కలిసి ఆయన ‘ఆగ్యాత్’ అనే హిందీ సినిమాలో నటించారు. దీనిని తెలుగులో ‘అడవి’ పేరుతో రిలీజ్ చేశారు. కనీసం ఈ సినిమా వచ్చిందన్న సంగతి తెలియకుండానే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. దీంతో నితిన్ మరోసారి బాలీవుడ్ వైపు చూడలేదు.
విక్రమ్:
సౌత్ స్టార్ హీరో విక్రమ్ ‘రావణ్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ‘డేవిడ్’, ‘పొన్నియన్ సెల్వన్ 1’తో ఆకట్టుకున్నారు.
సూర్య:
రక్త చరిత్ర 2 తో ఆల్ ఇండియా ప్రేక్షకులకు పరిచయం అయిన సూర్య.. ఆ తరువాత ఆయన నటించిన చాలా సినిమాలు హిందీలో డబ్ అయ్యాయి. అయితే రీసెంట్ గా ఆయన మరో సినిమాతో బాలీవుడ్ వెళ్లనున్నారు.

Vikram, Surya
దుల్కర్ సల్మాన్:
దుల్కర్ సల్మాన్ ‘కారవాన్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇది సక్సెస్ కాలేదు. ఆ తరువాత ‘ది జోయా ఫ్యాక్టర్’, ‘చుప్’ తదితర సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో ఆయనకు బీ టౌన్ లో గుర్తింపు వచ్చింది.