Megastar Chiranjeevi: 45 ఏళ్ల తిరుగులేని సినీ ప్రస్థానం… మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్స్ చేసిన చిత్రాలేమిటో తెలుసా?

వెంకటేష్ కెరీర్ బిగినింగ్ లో చేసిన చిత్రం త్రిమూర్తులు. అర్జున్, రాజేంద్ర ప్రసాద్ ఇతర హీరోలు. స్టార్డమ్ తెచ్చుకున్న చిరంజీవి ఒక పాటలో కనిపించారు. ఆ పాటలో టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఉంటారు.

  • Written By: Shiva
  • Published On:
Megastar Chiranjeevi: 45 ఏళ్ల తిరుగులేని సినీ ప్రస్థానం… మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్స్ చేసిన చిత్రాలేమిటో తెలుసా?

Megastar Chiranjeevi: వెండితెరపై చిరంజీవిది చెరగని చిరునామా. ఎంత చెప్పినా తరగని చరిత్ర. ఒక సామాన్యుడిగా పరిశ్రమలో అడుగుపెట్టి అసామాన్య హీరోగా ఎదిగారు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసిన చిరంజీవి దశాబ్దాల పాటు టాలీవుడ్ ని శాసించాడు. ఆయన పేరిట ఉన్న రికార్డులు ఎవరూ చేరుకోలేనివి. సుదీర్ఘ సినీ ప్రయాణంలో మరపురాని పాత్రలు చేశారు. చిరంజీవి మొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’ 22 సెప్టెంబర్ 1978లో విడుదలైంది. అంటే 45 ఏళ్ల ప్రస్థానం ఆయన పూర్తి చేసుకున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి గెస్ట్ రోల్స్ చేసిన సినిమాలు ఏమిటో చూద్దాం. స్టార్ డమ్ రాకముందు, వచ్చాక కూడా చిరంజీవి అతిథి పాత్రలు చేశారు. తయారయ్య బంగారమ్మ మూవీలో చిరంజీవి గెస్ట్ రోల్ చేశారు. సత్యనారాయణ, షావుకారు జానకి, చంద్రమోహన్ ప్రధాన పాత్రలు చేశారు. ఇది చిరంజీవి మూడో సినిమా కావడం విశేషం.

కృష్ణంరాజు, జయసుధ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కించిన చిత్రం ఆడవాళ్ళూ మీకు జోహార్లు. ఈ చిత్రంలో చిరంజీవి ఓ చిన్న పాత్రలో తళుక్కున మెరిశారు.

శారద, మురళీ మోహన్, శరత్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ప్రేమ నాటకం. ఇందులో కూడా చిరంజీవి అతిథి పాత్ర చేసి మెప్పించారు.

మా ఇంటి ప్రేమాయణం చిత్రంలో చిరంజీవి అతిథి పాత్ర చేశాడు. హీరోగా ఎదుగుతున్న రోజుల్లో చేసిన చిత్రం ఇది. చంద్రమోహన్, శరత్ బాబు, నూతన ప్రసాద్ ప్రధాన పాత్రలు చేశారు.

వెంకటేష్ కెరీర్ బిగినింగ్ లో చేసిన చిత్రం త్రిమూర్తులు. అర్జున్, రాజేంద్ర ప్రసాద్ ఇతర హీరోలు. స్టార్డమ్ తెచ్చుకున్న చిరంజీవి ఒక పాటలో కనిపించారు. ఆ పాటలో టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఉంటారు.

రజినీకాంత్ తమిళ చిత్రం మాప్పిళై. ఈ మూవీలో రజినీకాంత్ ఫ్రెండ్ గా చివర్లో చిరంజీవి ఎంట్రీ ఇస్తారు.

కన్నడ చిత్రం సిపాయిలో కూడా చిరంజీవి గెస్ట్ రోల్ చేశారు. రవిచంద్రన్ ఈ చిత్ర హీరో.

నాగబాబు, జయసుధ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ హ్యాండ్సప్. జయసుధ నిర్మాత కూడాను. చిరంజీవి గెస్ట్ రోల్ చేశారు.

రాఘవ లారెన్స్, ప్రభుదేవా నటించగా డాన్స్ ప్రధానంగా తెరకెక్కింది స్టైల్ మూవీ. ఇందులో క్లైమాక్స్ లో చిరంజీవి ఎంట్రీ ఉంటుంది.

ఇండస్ట్రీ హిట్ మగధీర చిత్రంలో చిరంజీవి గెస్ట్ రోల్ చేశారు. బంగారు కోడిపెట్ట సాంగ్ కి ముందు ఆయన కనిపిస్తారు. రాజమౌళి ఈ చిత్ర దర్శకుడు.

రామ్ చరణ్ మరో చిత్రం బ్రూస్ లీ. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో చిరంజీవి అతిథి పాత్ర చేశారు. మొత్తంగా 11 చిత్రాల్లో చిరంజీవి గెస్ట్ రోల్స్ చేశారు.

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు