Zealandia: ఆసియా నుంచి ఆఫ్రికా వరకు చిన్నప్పుడు మనం భూగోళ శాస్త్రం పుస్తకాల్లో ఖండాలు ఏడని చదువుకున్నాం. కానీ మనకు తెలియని ఎనిమిదవ ఖండం కూడా ఉంది.. దాని పేరు జీలాండియా. కాకపోతే ఇది సముద్రంలో మునిగిపోయింది.. అయితే సముద్రపు ఉపరితలం కంటే, ఖండాంతర ఉపరితలంకంటే దగ్గరగా ఉంటుంది.. ఇది 80 మిలియన్ సంవత్సరాల క్రితమే సముద్రంలో మునిగిపోయిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Zealandia
2017లో జీలాండియా అవశేషాలను భూగర్భ శాస్త్రవేత్తల బృందం ప్రకటించింది. దీనికి సంబంధించి 1960 ప్రాంతంలో శాస్త్రవేత్తలు ఎట్టకేలకు ఒక ఖండం నిర్వచనాన్ని అంగీకరించారు.. ఒక ఖండాన్ని విశాలమైన భౌగోళిక ప్రాంతంగా విస్తృతంగా నిర్వచించారు.. ఇది ఎత్తైన ప్రదేశం,. వివిధ రకాల శిలలు, మందమైన ఉపరితలాన్ని కలిగి ఉంది.. 1995లో భూ భౌతిక శాస్త్రవేత్త బ్రూస్ లుయోండిక్ జీలాండియా అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించారు.

Zealandia
1895లో స్కాటిష్ పర్యావరణవేత్త సర్ జేమ్స్ హెక్టర్ జీలాండియా ఉనికి గురించి మొదటిసారిగా ప్రపంచానికి చెప్పాడు.. అతడు న్యూజిలాండ్ ప్రాంతంలో అనేక పరిశీలన చేసి.. ఈ ఖండం పర్వత శ్రేణికి సంబంధించి అవశేషం అని నిర్ధారించారు. ఇక 1642లో డచ్ అన్వేషకుడు అబెల్ టాస్మాన్ దక్షిణ అర్ధగోళంలో ఒక విస్తారమైన ఖండం ఉనికిని కనుగొన్నాడు. కానీ దాని భూభాగం 94% నీటి కింద ఉందని అతనికి తెలియదు.. ఇక ఈ ఖండం ఆస్ట్రేలియాకు తూర్పున, ఆధునిక న్యూజిలాండ్ కు దిగువన ఉంది.. న్యూజిలాండ్ కు ఆడిషన్ లో, ఇది న్యూ కాలెడోనియా ఈ ద్వీపాన్ని చుట్టూ ముట్టి ఉంది.. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ ఖండం ఐదు మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.. ఇది చాలా టేక్టోనికల్ యాక్టివ్ ప్రాంతం.. ఇందులో కొంత భాగం ఆస్ట్రేలియన్ ప్లేట్ పై, మరో భాగం పసిఫిక్ ఫ్లేట్ పై ఉంది.