Varun Tej Lavanya Marriage: బాప్ రే అంతనా.. ఇటలీలో వరుణ్ తేజ్ పెళ్లికి అయిన ఖర్చు ఎంతో తెలుసా?
నవంబర్ 1న ఇటలీ దేశంలో వివాహం జరగాలని నిశ్చయించారు. విదేశాల్లో పెళ్లి కావడంతో కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించారు. పెళ్ళికి వారం రోజులు ముందే కొందరు ఇటలీ చేరుకున్నారు.

Varun Tej Lavanya Marriage: పెళ్లంటే నూరేళ్ళ పంట. జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే తంతు. అందుకే స్తోమతకు తగ్గట్లు ఘనంగా చేసుకోవాలని, తమ పెళ్లి గురించి పది మంది మాట్లాడుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇక సెలెబ్రిటీలు, సమాజంలో పేరున్న వారైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. కోట్లు ఖర్చు చేస్తారు. కుమారుడు వరుణ్ తేజ్ పెళ్లి కోసం నాగబాబు భారీగానే ఖర్చు చేశారని టాలీవుడ్ టాక్. ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసిన ఆయన ఖర్చుకు వెనకాడలేదట.
నవంబర్ 1న ఇటలీ దేశంలో వివాహం జరగాలని నిశ్చయించారు. విదేశాల్లో పెళ్లి కావడంతో కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించారు. పెళ్ళికి వారం రోజులు ముందే కొందరు ఇటలీ చేరుకున్నారు. బంధువుల కోసం లగ్జరీ హోటల్స్ లో విడిది ఏర్పాటు చేశారు. దీనికే లక్షల రూపాయలు వెచ్చించారు. ఇక పెళ్లి వేదిక, డెకరేషన్ కి మరింత ఖర్చు అయ్యింది.
ముఖ్యంగా పెళ్లి బట్టలకు భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. వరుణ్-లావణ్యల పెళ్లి బట్టలు ఇండియాలో పేరుగాంచిన మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. లావణ్య పెళ్లి చీర ఒక్కటే రూ. 10 లక్షలు అయ్యిందట. ఆమె రెడ్ కాంచీపురం చీర ధరించారు. వరుణ్ తేజ్ క్రీమ్ కలర్ షేర్వాణీ వేసుకున్నారు. అశ్విన్ మావ్లే, హాసన్ ఖాన్ స్టైలింగ్ చేశారట. ఇక విందులు, వినోదాలకు మరింతగా ఖర్చు అయ్యిందట.
ఇటలీ దేశంలో మూడు రోజులు పెళ్లి వేడుకలు జరిగాయి. కాక్ టైల్ పార్టీ, హల్దీ వేడుకలు నిర్వహించారు. ఒక అంచనా ప్రకారం నాగబాబు వరుణ్ తేజ్ వివాహానికి రూ. 10 కోట్లు ఖర్చు చేశారట. అప్పుడే అయిపోలేదు. నవంబర్ 5న హైదరాబాద్ లో చిత్ర ప్రముఖులు, సన్నిహితులు, రాజకీయ నాయకుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి మరో 2-3 కోట్లు ఖర్చు అయ్యే సూచనలు కలవు. వరుణ్ అంటే నాగబాబుకు ఎంత ప్రేమో పెళ్లి నిర్వహించిన తీరు చేస్తుంటే తెలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
