Lavanya Tripathi Saree: పెళ్లిలో లావణ్య త్రిపాఠి ధరించిన చీర ఖరీదు ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
చీర ఎవరు డిజైన్ చేశారు? చీర ధర ఎంత? అని తెగ సెర్చ్ చేస్తున్నారు. నిన్న సుశ్మిత వేసుకున్న డ్రెస్ గురించి మాట్లాడుకున్నారు. ప్రస్తుతం లావణ్య చీరనే ట్రెండ్ లో ఉంది.

Lavanya Tripathi Saree: కొన్ని రోజుల స్నేహం, ఆ తర్వాత ప్రేమ ఇప్పుడు పెళ్లి అనే బంధంతో ఒక్కటైన జంట లావణ్య త్రిపాఠి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. వీరిద్దరు సంవత్సరం కాదు ఏకంగా ఐదు సంవత్సరాల నుంచి ప్రేమించుకొని నిన్న ఒకటయ్యారు. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి ఇటలీలో ఒకటయ్యారు ఈ జంట. మెగా, అల్లు కుటుంబాలతో పాటు బంధువులు, స్నేహితులు మొత్తం కలిపి 120 మంది హాజరయ్యారు. ఇక నిన్నటి నుంచి వరుణ్, లావణ్య పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గోల్డ్ కలర్ షేర్వాణీలో వరుణ్ తేజ్ ఎరుపు రంగు కాంచీవరం చీరలో లావణ్య ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించింది. ఈ పెళ్లి తర్వాత అమ్మడు చీర గురించి చర్చ సాగుతుంది.
ఆ చీర ఎవరు డిజైన్ చేశారు? చీర ధర ఎంత? అని తెగ సెర్చ్ చేస్తున్నారు. నిన్న సుశ్మిత వేసుకున్న డ్రెస్ గురించి మాట్లాడుకున్నారు. ప్రస్తుతం లావణ్య చీరనే ట్రెండ్ లో ఉంది. అయితే ఈ చీరను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. తెలుగు సంప్రదాయం ప్రకారం ఈ చీరను డిజైన్ చేయించుకుందట లావణ్య. ప్రేమకు చిహ్నమైన ఎరుపును, మంచి మనుసును సూచించే గోల్డ్ ను కలగలిపి మనీష్ మల్హోత్రా ఈ చీరను డిజైన్ చేశారు. అయితే ఈ చీర ధర దాదాపు రూ. 7 నుంచి రూ. 10 లక్షల వరకు ఉంటుందని సమాచారం. మెగా కోడలు రేంజ్ కు తగ్గట్టు.. పెళ్లి చీరను డిజైన్ చేయించిందని కొనియాడుతున్నారు ఆమె అభిమానులు.
ఇక పెళ్లికి ముందే ఇటలీ చేరుకున్న మెగా ఫ్యామిలీ రేపు ఇండియాకు చేరుకోనున్నారు. ఎందుకంటే నవంబర్ 5న హైదరాబాద్ లో రిసెప్షన్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు టాలీవుడ్ మొత్తం కదిలి రానుంది. మొత్తం మీద ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ జంట కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నారు అభిమానులు.
