Sushmitha: వరుణ్ తేజ్ పెళ్లిలో సుస్మిత వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?
చూడడానికి డిఫరెంట్ గా ఉన్న ఈ డ్రెస్ ఖరీదు లక్షల్లో ఉంటుంది. అయితే ఈ కొణిదెల సుస్మిత ఆకుపచ్చ రంగులో ఉన్న ఒక వైరీటీ డ్రెస్ తో అట్రాక్టివ్ గా నిలిచింది. దీన్ని హైదరాబాద్ లోని మృణాళిని రావు అనే ఫ్యాషన్ డిజైనర్ డిజైన్ చేశారట.

Sushmitha: పెళ్లిళ్లు పేరంటాలు ఉంటే.. నార్మల్ పీపుల్స్ కూడా మంచి బట్టలు, ఖరీదైన బట్టలు దరించాలి అనుకుంటారు. మరి సెలబ్రెటీలు ఈ విషయంలో ఓ మెట్టు పైనే ఉంటారు. అందులోనూ మెగా ఫ్యామిలీ అయితే ఆ రేంజ్ వేరే ఉంటుంది. ప్రత్యేకమైన బట్టలు డిజైన్ చేయించి మరీ ధరిస్తారు. డబ్బున్న వాళ్లకు ఇవన్నీ కామన్. కేవలం బట్టలకే లక్షల్లో ఖర్చు పెడుతుంటారు. కాళ్లకు వేసుకునే చెప్పుల దగ్గర నుంచి హాండ్ బ్యాగ్ వరకు ప్రతి ఒక్కటి రిచ్ గా ఉండేలా చూసుకుంటారు. ఇక రీసెంట్ గా వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ఇందులో సుస్మిత వేసుకున్న డ్రెస్ ఖరీదు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..
చూడడానికి డిఫరెంట్ గా ఉన్న ఈ డ్రెస్ ఖరీదు లక్షల్లో ఉంటుంది. అయితే ఈ కొణిదెల సుస్మిత ఆకుపచ్చ రంగులో ఉన్న ఒక వైరీటీ డ్రెస్ తో అట్రాక్టివ్ గా నిలిచింది. దీన్ని హైదరాబాద్ లోని మృణాళిని రావు అనే ఫ్యాషన్ డిజైనర్ డిజైన్ చేశారట. ఇది అరకులోయ లోని కొందరు మహిళలు వేసుకునే డిజైన్ అని టాక్. దీన్ని ఎవరా కఫ్తాన్ అని అంటారు. ఈ డ్రెస్ ఖరీదు ఏకంగా రూ. 1,79,200 అని తెలుస్తోంది. నిన్న వరుణ్, లావణ్యల పెళ్లిలో ఈ డ్రెస్ తో మెరిసింది సుశ్మిత. మరి ఇంత ఖరీదు ఉండడానికి కారణం ఏంటి అనుకుంటున్నారా? ఇది ప్యూర్ పట్టుతో డిజైన్ చేశారట.
ప్యూర్ పట్టు మీద ఎంబ్రాయిడరీ డిజైన్ ను చేతితో నేచారట. ఇది ఆన్ లైన్ లో కూడా అందుబాటులో ఉంది. అయితే డబుల్ XL మాత్రం రూ. 1,97,120 ఉండగా.. 4 XL రూ. 2,15, 040 గా ఉంది. మరి ఈ అమ్మడు వేసుకున్న డ్రెస్ ఈ రేంజ్ లో ఖరీదు ఉంటే.. వరుణ్ తేజ్, లావణ్యల డ్రెస్ లకు ఏ రేంజ్ లో ఖర్చు అయిందో ఊహించుకోవడం కష్టమే. ఇక మెగా ఫ్యామిలీ మొత్తం బట్టలకే చాలా ఖర్చు పెట్టినట్టుగా ఉంది అంటూ కామెంట్లు కూడా వస్తున్నాయి.
