Chandrayaan-3 Budget: భారత్ చేపట్టే చంద్రయాన్-3 మిషన్ ఖర్చు ఎంతో తెలుసా..!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ గత కొన్నాళ్లుగా చంద్రయాన్ మెషిన్ ను విజయవంతంగా పూర్తి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారతదేశ అంతరిక్ష యాత్రలో తక్కువ బడ్జెట్ తో ప్రసిద్ధి చెందాయి. భూమిపై నిర్మించిన హాలీవుడ్ సినిమాల బడ్జెట్ కంటే చాలా రెట్లు తక్కువ ఖర్చుతో భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నిజమైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళుతోంది. చంద్రయాన్-3 తో కూడా భారతదేశం మునుపటి మిషన్ల సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది.

Chandrayaan-3 Budget: ప్రపంచ దేశాలు చంద్రుడిపై అడుగు పెట్టేందుకు వేలకోట్ల రూపాయలు విచిస్తుంటే.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాత్రం అతి తక్కువ మొత్తాన్ని వెచ్చించి ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేస్తుంది. ఇతర దేశాలకు భిన్నంగా ఒక హాలీవుడ్ సినిమా నిర్మించేందుకు అయ్యే ఖర్చు కంటే మొత్తంతోనే అంతరిక్ష యాత్రను పూర్తి చేస్తుండడం గమనార్హం. తాజాగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా మూడోసారి చంద్రయాన్ మిషన్ ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 14వ తేదీన చంద్రయాన్-3 అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. ఇస్రోకు చెందిన ఎల్వీఎం-3 రాకెట్ సాయంతో ఈ వ్యోమ నౌకను చంద్రుడిపైకి పంపించనున్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ అంతరిక్షంలోకి దూసుకుని వెళ్ళనుంది. భారత్ మరోసారి చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ లాండింగ్ కు ప్రయత్నించనుంది. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా చంద్రయాన్-2 చంద్రుడిపై ల్యాండ్ కాలేదు. అయితే, ఈసారి మాత్రం విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ గత కొన్నాళ్లుగా చంద్రయాన్ మెషిన్ ను విజయవంతంగా పూర్తి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారతదేశ అంతరిక్ష యాత్రలో తక్కువ బడ్జెట్ తో ప్రసిద్ధి చెందాయి. భూమిపై నిర్మించిన హాలీవుడ్ సినిమాల బడ్జెట్ కంటే చాలా రెట్లు తక్కువ ఖర్చుతో భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నిజమైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళుతోంది. చంద్రయాన్-3 తో కూడా భారతదేశం మునుపటి మిషన్ల సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది.
అతి తక్కువ బడ్జెట్ తో చంద్రయాన్-3 మిషన్..
ఇస్రో అతి తక్కువ బడ్జెట్ తో చంద్రయాన్-3 మిషన్ కోసం సిద్ధమవుతోంది. ముందుగా అంచనా వేసిన బడ్జెట్ రూ.600 కోట్ల రూపాయలు. అయితే, దీన్ని కాస్త పెంచడంతో రూ.615 కోట్లకు చేరింది. చంద్రయాన్-2తో పోలిస్తే ఇప్పటికీ చాలా తక్కువ. ఎందుకంటే చంద్రయాన్-2 మిషన్ బడ్జెట్ దాదాపు రూ.978 కోట్ల రూపాయలు. చంద్రయాన్-3 తక్కువ ధరకు ప్రధాన కారణం ఆర్బిటర్ ను ఉపయోగించకపోవడమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆర్బిటర్ కు బదులుగా ప్రొపల్షన్ మాడ్యూల్ ఉపయోగించబడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆర్బిటర్ తో పోలిస్తే నిర్మాణానికి తక్కువ ఖర్చు అవసరం అవుతుంది. అందుకే ఈ ప్రచార బడ్జెట్ కూడా భారీగా తగ్గింది.
ఆ సినిమా బడ్జెట్ కంటే చాలా తక్కువ..
అంతరిక్ష యానం.. మరో గ్రహాన్ని చూపించే హాలీవుడ్ సినిమా అవెంజర్స్ అండ్ గేమ్ బడ్జెట్ రూ.2,443 కోట్లు. అవతార్ సినిమా బడ్జెట్ రూ.3,282 కోట్లు. ఈ రెండు సినిమా బడ్జెట్లతో పోలిస్తే భారతదేశ అంతరిక్ష యాత్రల బడ్జెట్ చాలా తక్కువ.
మిగిలిన దేశాల బడ్జెట్ల కంటే కూడా..
భారత్ తోపాటు ప్రపంచంలోని అనేక దేశాలు అంతరిక్ష యాత్రలను చేపడుతున్నాయి. ఆయా దేశాల బడ్జెట్ తో పోలిస్తే భారత్ అతి తక్కువ మొత్తం తోనే అంతరిక్ష యాత్రను పూర్తి చేస్తోంది. చైనా చాంగు ఈ4 మూన్ మిషన్ ఖర్చు రూ.69.38 లక్షల కోట్లు కాగా, ఇప్పటి వరకు అమెరికా చేసిన మూన్ మిషన్ల ఖర్చు రూ.825 లక్షల కోట్ల రూపాయలు. అలాగే సోవియట్ యూనియన్ తన చంద్రుని మిషన్లపై చేసిన ఖర్చు కూడా దాదాపు 165 లక్షల కోట్లు. ఆయా దేశాలు వెచ్చించిన ఖర్చుతో పోలిస్తే భారత్ కొన్ని వందల రెట్ల తక్కువ మొత్తానికే తన మెషిన్ ను పూర్తి చేస్తోంది. భారత్ తన మొదటి చంద్రయాన్ ను అక్టోబర్ 22, 2008లో ప్రయోగించింది. చంద్రునిపై నీటిని కనుగొనేందుకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దీనికోసం భారత్ రూ.386 కోట్ల రూపాయలు వెచ్చించింది. దీని తర్వాత 2019లో ఇస్రో రెండోసారి చంద్రయాన్ ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఇది మూడో చంద్రయాన్ మిషన్.
