Eggs: మనకు పోషకాహారంపై శ్రద్ధ ఉంటుంది. మేలైన ఆహారాలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోషకాలు ఉండే ఆహారాల కోసం చూస్తున్నారు. విటమిన్లు ఉండే ఆహారాలతో మన శరీరాన్ని రోగాల బారి నుంచి రక్షించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పోషకాలు మెండుగా ఉండే ఆహారాల్లో కోడిగుడ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే మితంగా తింటేనే లాభం. అతిగా తింటే వీటి వల్ల కూడా నష్టాలు కలుగుతాయి. అందుకే గుడ్డు తినేటప్పుడు కొన్ని నిబంధనలు పాటించాల్సిందే.

Eggs
గుడ్డు మనకు ప్రొటీన్లు, విటమిన్లు సమృద్ధిగా లభించే ఆహారం. శరీరానికి కావాల్సిన శక్తి దీనితో అందుతుంది. గుడ్డులో చాలా రకాల గుణాలు ఉండటంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. కొన్ని వ్యాధులు ఉన్న వారు గుడ్డు తినడం హానికరం. చలికాలంలో సాధారణంగా గుడ్డును ఎక్కువగా తింటుంటారు. శరీరానికి వేడినిచ్చే వాటిలో గుడ్డును చేర్చుకోవడం సహజం. కొందరు మితంగా తినరు. అతిగా తినేందుకు మొగ్గు చూపుతారు. గుడ్లను అతిగా తింటే కూడా ప్రమాదకరమే. గుడ్డు అతిగా తినడం వల్ల అనర్థాలే వస్తాయి.
గుండె ఆరోగ్యానికి మంచి కొలెస్ట్రాల్ అవసరం. గుడ్లు తినడం వల్ల మంచి కొవ్వు మనకు లభిస్తుంది. దీంతో గుండె సంబంధిత రోగాలు రాకుండా కాపాడుతుంది. గుడ్లను అధికంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. జీర్ణక్రియ క్షీణించే ప్రమాదం ఉంటుంది. అజీర్తి, వాంతులు, వికారం, తలనొప్పి, కడుపునొన్పి వంటి సమస్యలు వేధిస్తాయి. గుడ్డును ఆమ్లెట్ లేదా ఉడకబెట్టిన తరువాత తీసుకోవడం చేస్తుంటాం. రోజుకు నాలుగు కంటే ఎక్కువ గుడ్లు తీసుకోవడం వల్ల చెడు ఫలితాలు చూపిస్తాయి.

Eggs
గుడ్లు ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తుంది. ఫలితంగా డయాబెటిస్ రోగులకు ఇబ్బందులు ఏర్పడతాయి. గుడ్లు తిన్న తరువాత మొటిమల సమస్య కూడా వేధిస్తుంది. హార్మోన్లలో మార్పులు రావడం సహజం. దీంతో గుడ్డులోని తెల్ల సొనలో అల్బుమిన్ ఉండటం వల్ల జీర్ణసమస్య వస్తుంది. గుడ్లు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి కూడా రక్షణ పొందొచ్చు.