Cholesterol: శరీరంలో చెడు కొవ్వు పెరగడానికి కారణాలంటే తెలుసా?
Cholesterol: మన జీవన విధానంలో వస్తున్న మార్పులతో రోగాలు కూడా వస్తున్నాయి. దీంతో మన ఆరోగ్య రక్షణకు ప్రమాదం ఏర్పడుతోంది. గుండె పనితీరు మందగిస్తోంది. ఫలితంగా గుండెపోటు వస్తోంది. ఎల్డీఎల్, హెచ్డీఎల్ కొలెస్ట్రాళ్లు ఉన్నాయి. ఎల్డీఎల్ చెడు కొలెస్ట్రాల్, హెచ్డీఎల్ మంచి కొలెస్ట్రాల్. మంచి కొవ్వు మన శరీరానికి అవసరం. చెడు కొవ్వు వల్ల నష్టం కలుగుతుంది. దీంతో గుండె జబ్బు ముప్పు రాకుండా ఉండాలంటే మన ఆహార పద్ధతులు మార్చుకోవాల్సిందే. దీనికి గాను మనం చర్యలు […]

Cholesterol: మన జీవన విధానంలో వస్తున్న మార్పులతో రోగాలు కూడా వస్తున్నాయి. దీంతో మన ఆరోగ్య రక్షణకు ప్రమాదం ఏర్పడుతోంది. గుండె పనితీరు మందగిస్తోంది. ఫలితంగా గుండెపోటు వస్తోంది. ఎల్డీఎల్, హెచ్డీఎల్ కొలెస్ట్రాళ్లు ఉన్నాయి. ఎల్డీఎల్ చెడు కొలెస్ట్రాల్, హెచ్డీఎల్ మంచి కొలెస్ట్రాల్. మంచి కొవ్వు మన శరీరానికి అవసరం. చెడు కొవ్వు వల్ల నష్టం కలుగుతుంది. దీంతో గుండె జబ్బు ముప్పు రాకుండా ఉండాలంటే మన ఆహార పద్ధతులు మార్చుకోవాల్సిందే. దీనికి గాను మనం చర్యలు తీసుకోవాల్సిందే.

Cholesterol
ప్రతిరోజు సైక్లింగ్, నకడ, ఈత వంటి వాటి వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తో గుండె కొట్టుకోవడంలో తేడా వస్తుంది. అధిక బరువు వల్ల కూడా గుండె జబ్బులు పొంచి ఉంటాయి. శరీరంలో చెడు కొవ్వు పెరిగిపోతే గుండెకు ప్రమాదం ఉంటుంది. బరువు పెరగడం, మద్యపానం, వ్యాయామం చేయకపోవడం, కొవ్వు పదార్థాలు తినడం వంటివి గుండె పనితీరును మందగించేలా చేస్తాయి. దీంతో శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతిని గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణాలవుతాయి.
శరీరంలో చెడు కొవ్వు పెరిగితే లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. ముందే లక్షణాలు గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది. వ్యాధి లక్షణాలు తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుంటే ముప్పు ఉండదు. చెడు కొవ్వు పెరగడం వల్ల శరీరంలో మార్పులు స్పష్టంగా తెలుస్తాయి. కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు రావడం, శరీరం అలసటకు గురికావడం, రక్తపోటు పెరగడం, శరీరంలో తిమ్మిర్లు వంటివి మనకు సూచనప్రాయంగా తెలియజేస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించి రక్తపరీక్ష చేయించుకుని చికిత్స తీసుకుంటే ప్రమాదం ఉండదు.

Cholesterol
11 నుంచి 55 సంవత్సరాల వయసు మధ్య గల వారు ప్రతి ఐదేళ్లకు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ పొందాలని చెబుతున్నారు. 45 నుంచి 65 సంవత్సరాలు గల పురుషులు, 55 నుంచి 64 సంవత్సరాల వయసు గల స్ర్తీలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కొవ్వు స్థాయిలను తగ్గించుకోవాలి. అన్ని రోగాలకు అడ్డుకట్ట వేసేందుకు అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అందుకే గుండె జబ్బులు రాకుండా చేసుకోవడంలో మనం ఎప్పటికప్పుడు చికిత్సలు చేయించుకుంటేనే ఫలితం కలుగుతుంది.
