Soaked Nuts Benefits: ఆరోగ్యంపై అందరికి శ్రద్ధ పెరుగుతోంది. ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో పోషకాలు గల ఆహారాలు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇనుము, ఫోలేట్, విటమిన్ బి12, విటమిన్ ఎ లోపం రక్తహీనతకు కారణమవుతాయి. విటమిన్ డి లోపం పెద్దవారిలో కనిపిస్తుంది. కాల్షియం, ఎముకల సంబంధిత వ్యాధులు చుట్టుముడతాయి. బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, వేరుశనగ వంటి గింజల్లో విటమిన్ బి, ఫోలేట్, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. సూపర్ ఫుడ్స్ ను క్రమం తప్పకుండా తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తినడం వల్ల పోషకాలు అందుతాయి. దీంతో వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం శ్రేయస్కరం.

Soaked Nuts Benefits
నానబెట్టిన వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నానబెట్టిన బాదంపప్పులు తినడం వల్ల మొటిమలు తగ్గుతాయి. రోజు 5-7 బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయం తింటే మంచి ప్రయోజనాలు దక్కుతాయి. రుతుక్రమ సమస్యల నుంచి ఎండు ద్రాక్ష మంచి లాభం కలుగుతుంది. 6-8 నానబెట్టిన ఎండుద్రాక్షను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే ఎన్నో లాభాలున్నాయి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ని రకాల మేలు కలగడంతో వీటిని తినేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
నానబెట్టిన వాల్ నట్స్ తో ఏకాగ్రత పెరుగుతుంది. రాత్రంతా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తో మెదడు పనితీరు బాగుంటుంది. స్త్రీలు, పిల్లల ఆరోగ్యానికి ఇవి ఎంతో దోహదం చేస్తాయి. జుట్టు, కండరాల ఆరోగ్యానికి ఇవి దోహదం చేస్తాయి. అంజీర్ పండ్లు మలబద్ధకం నుంచి ఉపశమనం లభించేలా చేస్తాయి. గర్భిణులు, సీనియర్ సిటిజన్లు మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

Soaked Nuts Benefits
పండ్ల కంటే డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగేందుకు దోహదపడుతుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి మంచిది. దీని వల్ల మనకు ఎన్నో విధాలుగా లాభం కలుగుతుంది. మన శరీరంలో జరిగే మార్పులకు ఇవి పరిష్కారాలు చూపుతాయి. ఈ నేపథ్యంలో బాదం, జీడిపప్పు, కిస్ మిస్ లు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిని తరచుగా తీసుకుంటే చాలా రకాలుగా మేలు కలుగుతుంది. డ్రై ఫ్రూట్స్ ను తీసుకుని ఆరోగ్యాన్ని దెబ్బ తినకుండా చూసుకోవడం ఉత్తమం.