Sleep : ఎడమ వైపు తిరిగి పడుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
Sleep : మనకు సహజంగా నిద్ర కావాల్సిందే. తిండి ఎంత అవసరమో నిద్ర కూడా అంతే. ఇవి రెండు సమభాగాలుగా ఉంటేనే మనిషికి ఆరోగ్యం. లేదంటే అనారోగ్యమే. జబ్బులు చుట్టుముడతాయి. చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు లాంటి వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ నేపథ్యంలో మనకు నిద్ర ప్రాముఖ్యత తెలుస్తోంది. అయితే పడుకునే విధానం కూడా మనకు మంచి రక్షణ కలగజేస్తుందని ఎంతమందికి తెలుసు. నిజమే పడుకునే స్టైల్ కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మనకు ఆరోగ్యం […]

Sleep : మనకు సహజంగా నిద్ర కావాల్సిందే. తిండి ఎంత అవసరమో నిద్ర కూడా అంతే. ఇవి రెండు సమభాగాలుగా ఉంటేనే మనిషికి ఆరోగ్యం. లేదంటే అనారోగ్యమే. జబ్బులు చుట్టుముడతాయి. చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు లాంటి వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ నేపథ్యంలో మనకు నిద్ర ప్రాముఖ్యత తెలుస్తోంది. అయితే పడుకునే విధానం కూడా మనకు మంచి రక్షణ కలగజేస్తుందని ఎంతమందికి తెలుసు. నిజమే పడుకునే స్టైల్ కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మనకు ఆరోగ్యం సిద్ధించేందుకు పరోక్షంగా సాయపడుతుంది.
జీర్ణవ్యవస్థ బాగుపడేందుకు..
మనం పడుకునే సమయంలో ఎటు వైపు తిరిగి పడుకుంటున్నామనే దానిపైనే మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. ఎడమ వైపు తిరిగి పడుకుంటే మన పేగులు వ్యర్థాలు బయటకు పంపించేందుకు సాయపడుతాయి. ఎడమ వైపు తిరిగి పడుకోవడంతో కడుపు, ఫ్రాంక్రియాస్ గ్రంథి ప్రభావం బాగుంటుంది. దీంతో యాసిడ్, రిఫ్లక్స్, గుండెల్లో మంట వంటి వాటిని నివారించుకోవచ్చు. ఎడమ వైపు తిరిగి పడుకోవడం మూలంగా మనకు ఎన్నో లాభాలు కలుగుతున్నాయి.
వెన్నునొప్పి
వెన్నునొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల ఇది వచ్చే అవకాశం ఉండదు. నిద్రలో వెన్నముకపై ఒత్తిడి తగ్గడంతో ఆ బాధ రాదు. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. గుండెపై ఒత్తిడి తగ్గి రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. ఎడమవైపు తిరిగి పడుకుంటే ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకుని మనం అలా నిద్రించేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
గురకకు చెక్
చాలా మంది గురకపెట్టి నిద్రిస్తుంటారు. దీని వల్ల ఎదుటి వరికి ఇబ్బంది ఏర్పడుతుంది. కానీ ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల శ్వాసనాళాలు తెరిచి ఉంచడం వల్ల గురక రాకుండా నిరోధిస్తుంది. గర్భిణులు కూడా ఎడమ వైపు తిరిగి పడుకోవవడం వల్ల కడుపులో పిండం, కిడ్నీలకు రక్తప్రసరణ బాగా జరిగి ఆరోగ్యం బాగుంటుంది. దీని వల్ల వారికి ఇతర సమస్యలు రాకుండా చేయడంలో ఇది పరోక్షంగా సాయపడుతుంది. అందుకే మనం ఎడమ వైపు తిరిగి పడుకోవడానికి ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
క్లీనింగ్
ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల మన శరీరంలోని మలినాలు బయటకు పంపించేందుకు మన జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఆరోగ్య పరిరక్షణకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. అందుకే అందరు ఎడమ వైపు తిరిగి పడుకునేందుకు ప్రయత్నించడం వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. దేహ రక్షణకు ఇలాంటి అలవాటు చేసుకుంటే మనకే మంచిది. ఇన్ని రకాల సమస్యల నుంచి విముక్తి కలిగించంలో ఎడమ వైపు తిరిగి పడుకోవడం సాయపడుతుందని తెలుసుకుని ఆ దిశగా ప్రయత్నించి రోగాలను దూరం చేసుకోండి.
