
Money Astrology
Money Astrology: వాస్తు శాస్త్రం ఎంతగానో ప్రాచుర్యం పొందుతోంది. వాస్తు టిప్స్ పాటించి మన కష్టాలను దూరం చేసుకోవాలని అందరు కోరుకుంటారు. వాస్తు దోషాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. రాహు, కేతు దోషాల నుంచి విముక్తం కావాలని చూస్తుంటారు. దీనికి గాను ఓ చిన్న పరిహారం పాటించాలి. మనం వాడే పర్సు గురించి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. పర్సులో ఓ వస్తువు పెట్టుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేస్తోంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా దూరం చేస్తుందని నమ్ముతుంటారు.
పసుపు కొమ్ముతో ప్రయోజనాలు
మన ఇళ్లలో పసుపును అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. మన ఇళ్లల్లో పసుపును ప్రతి శుభకార్యంలోనూ వాడుతుంటాం. పూజలు చేసే క్రమంలో కూడా పసుపును దోష నివారణకు ఉపయోగిస్తాం. జీవితంలో మనకు ఎదురయ్యే దోషాల నుంచి పసుపు కాపాడుతుంది. సమస్యల నుంచి బయట పడటానికి పర్సులో పసుపు కొమ్ము కానీ ముద్ద గానీ ఉంచుకుంటే మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. పసుపును పర్సులో పెట్టుకోవడం వల్ల పలు దోషాల నుంచి విముక్తి కలుగుతుంది.
గురు గ్రహానికి..
గురుగ్రహానికి సంబంధించిన దోషాలు నివారించుకోవడానికి పసుపు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా లేకుండా పోతాయి. పసుపు ముద్దను పర్సులో ఉంచుకోవడం ద్వారా సమస్యల నుంచి దూరం కావచ్చు. రాహు, కేతు గ్రహాల దోషాల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనదిగా పసుపును భావిస్తారు. డబ్బులు దాచుకునే బీరువా, లాకర్లలో కూడా పసుపు ఉంచుకోవడం మంచి ఫలితాలు ఇస్తుంది. పసుపు ముద్దను లాకర్లలో ఉంచుకుంటే ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి.
ఎరుపు లేదా పసుపు గుడ్డలో..
పసుపును ఎరుపు లేదా పసుపు గుడ్డలో ఉంచడం శ్రేయస్కరం. మన ఇళ్లలో డబ్బు దాచుకునే చోట పసుపు కొమ్ము కానీ పసుపు ముద్దను ఉంచుకోవడం వల్ల మనకు ఎంతో మంచిది. దోషాలను దూరం చేయడంలో పసుపు ప్రధాన భూమిక పోషిస్తుంది. పసుపు వల్ల మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు దక్కుతాయి. ఇలా పసుపును మన నిత్య జీవితంలో భాగంగా చేసుకున్నా అది శుభప్రదంగానే చూస్తున్నాం. అందుకే పసుపుతో మన ఇల్లు నందనవనంగా మారడం ఖాయమే. దీంతో పసుపు ముద్ద, కొమ్ము కానీ పర్సులో ఉంచుకుని మన బాధలు పోయేలా చేసుకోవాలి.

Money Astrology
వసుపు వాడకంతో..
మన ఇంటికే కాదు మనకు కూడా పసుపు మంచి ఫలితాలే ఇస్తోంది. దీని వాడకంతో కష్టాలు తొలగుతాయి. దీనికి మనం పాటించే చిన్న పరిహారమే. పసుపును మన పర్సులో ఉంచుకోవడం. దీనికి అందరు కట్టుబడి ఉంటే చాలు వారి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ నేపథ్యంలో పసుపును వాడుకుని మన దోషాలు నిర్మూలించుకోవడానికి ప్రయత్నించాలి.