Jaggery Tea: బెల్లం టీ తో బోలెడు లాభాలు.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..
బెల్లం టీ ని ఇటీవల కొన్ని కాఫీ షాపులు ప్రత్యేకంగా తయారు చేస్తున్నాయి. చక్కెర టీ తో మానసిక ఉల్లాసాన్ని పొందినా భవిష్యత్ లో అనేక వ్యాధులకు గురి చేస్తుంది.

Jaggery Tea: సాధారణంగా మనం తాగే టీ లో చక్కెర వేసుకుంటాం. కాస్త టేస్ట్ లేకపోతే మరింత ఎక్కువగా వేసుకొని సేవిస్తాం. టీ తాగడం వల్ల మాససిక ప్రశాంతత ఏర్పడుతుంది. అయితే చక్కెర టీ ని చాలా మంది తాగడానికి ఇష్టపడరు ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు చక్కెరకు దూరంగా ఉండాల్సిన పరిస్తితులు కాబట్టి చక్కెర టీని తీసుకోవడం అంత మంచిది కూడా కాదు. ఈ తరుణంలో ఇటీవల బెల్లం టీని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చక్కెర టీ కంటే రుచికరంగా లేకపోయినా ఆ టీ కంటే ఎక్కువ లాభాలు ఇస్తుంది. కేవలం మధుమేహం ఉన్నవారికి మాత్రమే కాకుండా సాధారణ వ్యక్తులు కూడ బెల్లం టీ తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని కొంత మంది వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ బెల్లం టీ లో ఎలాంటి పోషకాలు ఉంటాయో తెలుసుకుందాం.
బెల్లం టీ ని ఇటీవల కొన్ని కాఫీ షాపులు ప్రత్యేకంగా తయారు చేస్తున్నాయి. చక్కెర టీ తో మానసిక ఉల్లాసాన్ని పొందినా భవిష్యత్ లో అనేక వ్యాధులకు గురి చేస్తుంది. అంతేకాకుండా చక్కెర టీ తో బరువు పెరిగే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. చక్కెర టీ కి అలవాటుపడిన చాలా మంది రోజుకు కనీసం 5 నుంచి 6 వరకు సేవిస్తారు. కానీ ఇలా తాగడం వల్ల జీర్ణ సమస్యలు విపరీతంగా వస్తాయని చెబుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగానే బెల్లం టీ అందుబాటులోకి వచ్చింది.
బెల్లం టీ ని తాగాలనుకునేవారు టీ షాపుల్లో దొరకనట్లయితే ఇంట్లోనే తయారు చేసుకొవచ్చు. 2 కప్పుల నీరు తీసుకొకి వేడి చేయండి. ఇందులో అల్లం -తగినంత, యాలకులు-3, తులసి ఆకులు-కొన్ని, దాల్చిన చెక్క-చిన్న ముక్క వేసి 5 నిమిషాలు మరగబెట్టండి. ఆ తరువాత చిటికెడు మిరియాల పొడిని వేయండి. చివరగా కాస్త టీపొడితో పాటు బెల్లంను మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని బాగా మరగనిచ్చిన తరువాత కాస్త చల్లారనివ్వాలి. ఆ తరువాత వడబోసి తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
బెల్లం టీ తీసుకోవడం వల్ల డైజేషన్ సమస్యలు తొలిగిపోతాయి. తిన్నం అన్నం వెంటనే జీర్ణమవుతుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. ఐరన్ లోపం ఉన్నవారు బెల్లం టీ తీసుకోవడం వల్ల ప్రయోనం ఉంటుంది. అలాగే రక్తహీనతను తొలగిస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. బెల్లం టీ లో పొటాషింయ మెండుగా ఉంటుంది. ఇది ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. కండరాలను నిర్మించడానికి జీవక్రియను పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది.
