Priyanka Jawalkar: పవన్ కల్యాణ్ సాంగ్ కు స్టెప్పులేసి ఇరగదీసిన నటి.. ఎవరో తెలుసా?

సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో ఆడియన్స్ కు కనెక్ట్ అవుతూ ఉంటుంది ప్రియాంక జువాల్కర్. ఈ పేరు కొంత మందికి తెలియకపోయినా విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ సినిమా చూసిన వారికి గుర్తుకు వస్తుంది.

  • Written By: SS
  • Published On:
Priyanka Jawalkar: పవన్ కల్యాణ్ సాంగ్ కు స్టెప్పులేసి ఇరగదీసిన నటి.. ఎవరో తెలుసా?

Priyanka Jawalkar: సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతీ హీరోయిన్ స్టార్ అయ్యే ఛాన్స్ ఉండదు. కానీ గుర్తింపు కోసం కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వీరికి సినిమాల్లో అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియా ద్వారా తమ పర్ఫామెన్స్ చూపిస్తుంటారు. అలా తమ ప్రతిభ చూపిన చాలా మంది సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుని స్టార్లు అయిన వారున్నారు. అయితే తాజాగా ఓ భామ కొన్ని సినిమాల్లో నటించి పరిచయం అయినా స్టార్ కాలేకపోయింది. దీంతో సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ గా ఉంటూ అందచందాలను ఆరబోస్తుంది. అంతేకాకుండా డ్యాన్స్ లతో అదరగొడుతోంది. తాజాగా ఈ భామ ఏం చేసిందో తెలుసా?

సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో ఆడియన్స్ కు కనెక్ట్ అవుతూ ఉంటుంది ప్రియాంక జువాల్కర్. ఈ పేరు కొంత మందికి తెలియకపోయినా విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ సినిమా చూసిన వారికి గుర్తుకు వస్తుంది.ప్రియాంక జువాల్కర్ టాక్సీవాలా తరువాత సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ కొంత గ్యాప్ తీసుకున్న తరువాత కిరన్ అబ్బవరం తో కలిసి ‘ఎస్ ఆర్ కల్యాణ మండం’ లో నటించింది. ఈ సినిమా యావరేజ్ హిట్ కావడంతో ఆమెకు ఫ్యాన్స్ పెరిగారు. ఆ తరువాత తిమ్మరుసు, గమనం వంటి సినిమాల్లో నటించింది.

అయితే తాజాగా ఈ సుందరి మినీ బికినీ డ్రెస్ లో కనిపించి హల్ చల్ చేస్తోంది. అందాలన్నీ చూసుకోండి.. అన్నట్లు గా ప్రదర్శిస్తోంది. మరోవైపు పవన్ కల్యాణ్ సినిమా గుడుంబా శంకర్ సినిమాలోని చిట్టి నడుమునే చూస్తున్నా అనే పాటకు డ్యాన్స్ చేసింది. ఇందులో ఆమె వేసిన స్టెప్పులుకు యూత్ ఫిదా అవుతున్నారు. డ్యాన్ష్ చాలా బాగా చేస్తున్నారంటూ కొందరు కామెంట్లు పెట్టడం విశేషం. ఈ డ్యాన్స్ లో ప్రియాంక జువాల్కర్ గుడుంబా శంకర్ ప్యాంట్ వేసుకొని తన కుక్కతోకలిసి డ్యాన్ష్ చేసింది.

ప్రస్తుతం ప్రియాంక జువాల్కర్ కు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ సినిమలో ఓ చిన్న పాత్రలో నటిస్తోంది. అయతే స్టార్ ఇమేజ్ కోసం ప్రియాంక పడరాని పాట్లు పడుతున్నట్లు తెలుస్తుంది. నిత్యం వివిధ యాక్టింగ్ లతో అదరగొడుతూ పలు సినిమాలకు డ్యాన్ష్ చేస్తోంది. దీంతో రోజురోజుకు ఈ అమ్మడుకు ఫ్యాన్ష్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Jawalkar (@jawalkar)

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు