West Bengal : పశ్చిమ బెంగాల్ ఎలా భారత్ లో అంతర్భాగమయిందో తెలుసా?
పశ్చిమ బెంగాల్ ఎలా భారత్ లో అంతర్భాగమయింది.. దాని కథేంటి అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
West Bengal : పశ్చిమ బెంగాల్ లో ఓ పెద్ద వివాదం నడుస్తోంది. అసలు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏరోజున జరపాలన్నది సమస్య ఉంది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంపై కూడా వివాదం ఉంది. విలీన, విమోచన, విద్రోహ దినమంటూ వివాదం ఉంది. పోయిన సంవత్సరం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజును నిర్వహించింది.కేసీఆర్ ‘ఐక్యత దినోత్సవం’ పేరుతో జరిపించి మమ అనిపించారు.
ఆంధ్ర అవతరణ దినోత్సవంపై కూడా ఎంతో వివాదం నడిచింది. బెంగాల్ లో ఇప్పుడు ఇదే పరిస్థితి ఏర్పడింది. బెంగాల్ విడిపోయి 75 సంవత్సరాలు అవుతోంది. ఈ 75 ఏళ్లుగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆ రాష్ట్ర ప్రజలు జరుపుకోలేకపోతున్నారు. ఒక విధంగా బీజేపీ అధికారంలోకి రాకపోయినా బీజేపీ గణనీయంగా ఓట్లు సంపాదించుకున్న ఈ సమయంలోనే దీనిపై చర్చకు లేవనెత్తారు.
బెంగాల్ లో జూన్ 20న ఆ రాష్ట్ర గవర్నర్ అధికారికంగా బంగ్లా దివస్ గా ప్రకటించారు. మమతా బెనర్జీకి ఈ ప్రకటనపై కోపం వచ్చింది. నువ్వు ఎవరూ అంటూ నిలదీసింది. సెప్టెంబర్ 7వ తేదీన ‘పొహలే బైశాకీ’ అంటూ బంగ్లా దివస్ గా ఆమె ప్రకటించి అధికారికంగా జరపడానికి రెడీ అయ్యింది. ఎందుకీ వివాదం? రెండు తేదీలు ఏమిటీ.?
పశ్చిమ బెంగాల్ ఎలా భారత్ లో అంతర్భాగమయింది.. దాని కథేంటి అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
