Lady Finger Benefits: ఆధునికి కాలంలో ఆహార అలవాట్లు మారుతున్నాయి. జీవనశైలి కొత్త పోకడలతో పోతోంది. దీంతో రోగాలు వ్యాపిస్తున్నాయి. మనం తీసుకునే ఆహారమే మనకు ప్రతిబంధకంగా మారుతోంది. లైఫ్ స్టైల్ మారడంతో రోగాలు చుట్టుముడుతున్నాయి. తినే ఆహారంతోనే మన ఆరోగ్యం దెబ్బతింటోంది. అయినా నిర్లక్ష్యంగానే ఉంటున్నాం. ఈ నేపథ్యంలో మన ఆహార అలవాట్లను మార్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఎవరు కూడా లెక్కచేయడం లేదు. పాతికేళ్లకే మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి రోగాలకు దగ్గరవుతున్నారు.

Lady Finger Benefits
మనం తీసుకునే ఆహారంలో మనకు చేటు కలిగించేవే ఎక్కువగా ఉంటున్నాయి. అధిక కొవ్వు కలిగిన వాటిని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతోంది. ఫలితంగా గుండెపోటు వంటివి వస్తున్నాయి. గతంలో ఎప్పుడే డెబ్బయి ఎనభై ఏళ్లకు వచ్చే గుండెపోటు ప్రస్తుతం పాతికేళ్లకే వస్తుందంటే మన ఆహార అలవాట్లే ప్రధాన కారణం. అందరు మాంసాహారాలకు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. దీంతో గుండె వేగం మందగిస్తుంది. రక్తనాళాలు మూసుకుపోయి గుండెపోటుకు దారి తీస్తోంది.
చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే కూరగాయల్లో బెండకాయ ప్రధానమైనది. కూరగాయల్లో ఉండే ప్రొటీన్లు మనకు ఎంతో మేలు చేస్తాయి. ఏ కూరగాయ అయినా మన ఆరోగ్యానికి మేలు చేసేదే. అందులో బెండకాయ మనకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగించడంలో ముందుంటుంది. దీంతో బెండకాయను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమమే. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉండటంతో దీన్ని కూరల్లో చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

Lady Finger Benefits
బెండకాయతో అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అధిక కొవ్వుతో వచ్చే ముప్పును బెండకాయ చాలా వరకు తగ్గిస్తుంది. మధుమేహానికి కూడా బెండకాయ మందులా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఆకలిని పెంచుతుంది. ఇన్ని రకాల లాభాలున్న బెండకాయను రోజు కూరల్లో వేసుకోవడం మంచిదే. రోజు రెండు బెండకాయలను రాత్రి నీళ్లలో నానబెట్టి తెల్లవారి తీసుకుంటే మధుమేహం కంట్రోల్ అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెండకాయలో ఇంత మంచి గుణాలుండటంతో దీన్ని తినాల్సిదే. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బెండకాయను కూరగా తీసుకున్నా మన శరీరానికి కావాల్సిన అన్ని ప్రొటీన్లు అందించి మనకు ఎంతో ఉపయోగపడుతుందని భావించి దాన్ని ఆహారంగా తీసుకోండి.