Husband And Wife Relationship: భార్యాభర్తల బంధం ఎంతో విలువైనది. కలకాలం కలిసి ఉండే దంపతుల మధ్య ఎన్నో రకాల గొడవలు వచ్చినా చివరకు వారు కడదాకా తోడు నీడగానే ఉంటారు. వారి మధ్య ఎన్ని అభిప్రాయ భేదాలు వచ్చినా వారి బంధం శాశ్వతమే. ఆలుమగలంటే ఒకే కావడికి ఉండే కావడి కుండల్లాంటి వారు. ఆప్యాయత, అనురాగం వారి మధ్య పెనవేసుకుంటుంది. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ ఉంటుంది. భార్య ఏదైనా చేయడానికి భర్త వెనకాడడు. భర్త సర్వస్వం కోసం భార్య తన జీవితాన్నే అంకితం చేస్తుంది. భర్త కుటుంబం కోసం అన్ని త్యాగాలు చేస్తుంది. తన ఇష్టాలను సైతం పట్టించుకోకుండా మెట్టినింటి క్షేమం కోసమే పాటుపడుతుంది.

Husband And Wife Relationship
పిల్లలతో జాగ్రత్త సుమా
దంపతులకు పిల్లలు కలగడం సహజమే. వారి ముందు మనం భార్యతో అలా ఉండటం సబబు కాదు. వారిని కనిపెట్టుకుని ఉండాలి. ఎప్పుడు కూడా పిల్లల ఎదుట శృంగార కార్యకలాపాలకు దిగితే ముప్పే. వారు మనల్ని అనుకరిస్తారు. అందుకే వారి ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా కలవకూడదు. ప్రేమగా ఉండకూడదు. ఒకే గదిలో పడుకునే వారు పిల్లలను గమనించాలి. అంతేకాని వారి ముందు ఎలా పడితే అలా ఉంటే మనపై వారికి గౌరవం పోతుంది. మనం చెప్పే మాటలు వినరు. చులకన అయిపోతాం.
భార్యను బానిసగా చూడొద్దు
భార్య అంటే మనతో సమానమైన హక్కుల కలిగినది. దీంతో ఆమెపై రుసరుసలాడకూడదు. చీటికి మాటికి తిడితే కూడా వారి అహం దెబ్బతింటుంది. దీంతో మొదటికే మోసం వస్తుంది. ఏదైనా సున్నితంగా పరిష్కరించుకోవాలి. కానీ అరుపులు, కేకలతో గొడవకు దిగితే పోయేది మన పరువే. భార్యను వంటింటి కుందేలుగా భావించొద్దు. మన జీవిత భాగస్వామిగానే చూడాలి. ఆమెకు ఇచ్చే గౌరవం ఇవ్వాలి. అప్పుడే మనకు జీవితాంతం సేవ చేస్తుంది. మొండిగా వాదిస్తూ ఆమె అహం దెబ్బతినేలా చేస్తే ఇక ఎవరికి వినదు.
బయటకు తీసుకెళ్తుండాలి
ఎప్పుడు వంటింటికే పరిమితం చేయకుండా అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్తుండాలి. వారాంతాల్లో పార్కులు, సినిమాలు, ఇతర ప్రదేశాలకు తీసుకెళ్తుంటే మనసు కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆమెకు మీపై అభిమానం పెరుగుతుంది. ఇలా భార్యను తమకు దగ్గరకు ఉంచుకుంటే మనం ఏం చెప్పినా చేస్తుంది. ఆమెను ఎప్పుడు ఇంటికే పరిమితం చేస్తే ఆమె మెదడు కూడా మొద్దుబారిపోయినట్లు అవుతుంది. దీంతో భార్యకు కూడా ఆశలు ఉంటాయని తెలుసుకుని ప్రవర్తిస్తే మనకు అండగా నిలుస్తుంది.
వంటలపై పెదవి విరుపు వద్దు
భార్య మనకు వండి పెడుతుంది. ఆమె వడ్డించే పదార్థాలపై బాగా లేవని చెబితే వండటానికి ఆమె వెనకాడుతుంది. అలా కాకుండా ఇంకా కొంచెం రుచిగా వండితే ఇంకా బాగుంటుందని తెలివిగా చెప్పేందుకు ప్రయత్నించాలి. అంతేకాని మొహం మీదే నీ వంట బాగా లేదని చెబితే నొచ్చుకుంటుంది. సున్నితంగా మెల్లగా ఆమెను మనవైపు మరల్చుకోవాలి. కోపంతో ఉంటే మనకు దూరంగా జరుగుతుంది. ప్రేమతో దగ్గరకు తీసుకుంటే మనం ఏది చెబితే అది చేసేందుకు ముందుకొస్తుంది.

Husband And Wife Relationship
ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలి
భార్యకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి. వంటింట్లోకి కావాల్సిన సరుకులు తీసుకురావడానికైనా ఆమె వద్ద కొంచెం డబ్బు ఉండాలి. లేదంటే ఆమెకు ఇబ్బందులు తప్పవు. ఆమె దగ్గర డబ్బు ఉంటే ఏదైనా కొనుక్కోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఎప్పుడు మనల్ని అడగకుండా కొంత డబ్బు ఉంచితే దాంతో తమకు కావాల్సిన వాటిని కొనుగోలు చేసుకుంటుంది. తన పని తాను చేసుకుంటుంది. ఇలా భార్యను బాధపెట్టకుండా చూసుకుంటే ఆమె మన మీద ప్రేమ చూపుతుంది. దీంతో మనకు జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి.