Weight Loss Tips: ఇటీవల కాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. దీనికి కారణం మన ఆహార అలవాట్లే. మనం తీసుకునే ఆహారమే మనల్ని బరువు పెరిగేలా చేస్తుంది. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఇరవై ఏళ్లకే అరవై ఏళ్ల వారిలాగా అనిపిస్తున్నారు. దీంతో నలుగురిలో కలిసేందుకు బిడియపడుతున్నారు. బేకరి ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫిజాలు, బర్గర్లు, ఐస్ క్రీంలు ఇలా ఏది పడితే అది లాగిస్తూ మన శరీరాన్ని అదుపు తప్పేలా చేసుకుంటున్నారు. తరువాత నేను లావవుతున్నానని బాధపడితే ఏం లాభం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. బరువు పెరగకముందే జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో వస్తున్న మార్పులను గమనించాలి.

Weight Loss Tips
అధిక బరువు అనర్థమే. అన్ని రోగాలకు మూల కారణం. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, థైరాయిడ్ వంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణం అధిక బరువు అని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మనం తీసుకునే ఆహారం అదుపు తప్పితేనే అధిక బరువు ముప్పు పొంచి ఉంటుంది. ఏది పడితే అది తింటే కడుపుకు కష్టమే. దీంతో మనం తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండాలి. అంతేకాని చక్కెర, ఉప్పు, నూనెలు ఎక్కువగా ఉన్న వాటిని తింటే బరువు పెరగడం ఖాయమే. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని మనం తినే పదార్థాలను ఎంపిక చేసుకోవడం మంచిది.
ఆధునిక కాలంలో ఎవరిని చూసినా బస్తాల్లా కనిపిస్తున్నారు. చిన్న వయసులోనే పెద్దగా శరీరం పెంచుకుని నీరస పడుతున్నారు. నడవడానికి ఇబ్బందులు పడుతున్నారు. శరీరంలో కొవ్వు పెరిగిపోయి భారీకాయులుగా మిగిలిపోతున్నారు. దీంతో ఏ పని చేయలేకపోతున్నారు. తమ ప్రాప్తానికి తామే కారణమని కుమిలిపోతున్నారు. దీనికి మనం ముందు నుంచి తినే వాటి విషయంలో కాస్త శ్రద్ధ పెడితే ఇలాంటి ఉపద్రవాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఆయుర్వేదంలో అధిక బరువు తగ్గించడానికి అనేక చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటించి శరీర బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.
ప్రతి రోజు ఉలవ జావ తాగితే బరువు తగ్గుతారని చెబుతున్నారు. అంతే కాకుండా నూనె, వేపుళ్లు, ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్స్ వంటి వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. మన దినచర్యలో మార్పులు చేసుకుంటే అధిక బరువును అదుపు చేసుకోవడం సాధ్యమే. దీనికి కొన్ని నియమాలు పాటించాలి. పగటిపూట నిద్ర పోకూడదు. రాత్రుళ్లు మాత్రమే నిద్ర పోవాలి. తినే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకుంటే సరి. బరువు వెంటనే తగ్గడం మళ్లీ పెరగడం వల్ల ఆందోళన ఇంకా పెరుగుతుంది.

Weight Loss Tips
స్వీట్లు, నూనె, చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల అధిక బరువు ముప్పు పొంచి ఉంటుంది. దీంతో వీటిని తీసుకోకపోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. జెనటిక్ సమస్య, వారసత్వ లక్షణాలు, శరీర మార్పులు వంటివి మనకు అధిక బరువు రావడానికి కారణమవుతాయి. మజ్జిగ, ఉలవలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఉదయం లేవగానే గ్లాసు నీళ్లలో దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే ఫలితం ఉంటుంది. ఉలవ జావ తీసుకుంటే కూడా మేలు కలుగుతుంది. కూరగయాలు, ఆకుకూరలు తీసుకోవాలి. పెరుగు, అరటిపండు, దుంపకూరలకు దూరంగా ఉంటే మంచిది.
ఒత్తిడికి దూరంగా ఉండాలి. మానసిక పరిపక్వతతో ఉండేందుకు ప్రయత్నించాలి. ప్రతి రోజు యోగా చేయాలి. దీంతో అధిక బరువు నుంచి దూరం కావచ్చు. తినేటప్పుడు టీవీ, కంప్యూటర్ వంటివి చూసుకుంటూ తినకూడదు. మెంతి చూర్ణం తీసుకోవడం వల్ల కూడా లాభాలున్నాయి. ఇలా అధిక బరువు నుంచి ఉపశమనం కలిగించుకునే ప్రయత్నంలో వీటిని పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉందని గుర్తుంచుకోవాలి.