Bad Breath: నోటి దుర్వాసనను ఎలా దూరం చేసుకోవాలో తెలుసా?
Bad Breath: మనలో చాలా మందికి నోరు దుర్వాసన వస్తుంది. వారితో మాట్లాడాలంటే మనం ముక్కు మూసుకోవడమే. అంతటి దుర్వాసన వారి నోటి నుంచి వస్తుంది. ఇది ఎందుకొస్తుంది? కారణాలేంటి అని ఆరా తీస్తే చిగుళ్లకు, నాలుకకు సంబంధించిన సమస్యల కారణంగా నోటి దుర్వాసన రావడం సహజం. నోరు శుభ్రంగా లేకపోతే దుర్వాసన వస్తుంది. రోజుకు రెండుసార్లు నోరును శుభ్రం చేసుకోవాలి. నోరు పొడిబారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు సైతం నోరు దుర్వాసన వచ్చే అవకాశముంటుంది. […]


Bad Breath
Bad Breath: మనలో చాలా మందికి నోరు దుర్వాసన వస్తుంది. వారితో మాట్లాడాలంటే మనం ముక్కు మూసుకోవడమే. అంతటి దుర్వాసన వారి నోటి నుంచి వస్తుంది. ఇది ఎందుకొస్తుంది? కారణాలేంటి అని ఆరా తీస్తే చిగుళ్లకు, నాలుకకు సంబంధించిన సమస్యల కారణంగా నోటి దుర్వాసన రావడం సహజం. నోరు శుభ్రంగా లేకపోతే దుర్వాసన వస్తుంది. రోజుకు రెండుసార్లు నోరును శుభ్రం చేసుకోవాలి. నోరు పొడిబారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు సైతం నోరు దుర్వాసన వచ్చే అవకాశముంటుంది.
నోటి దుర్వాసనను వైద్య పరిభాషలో హ్యలిటోసిస్ అంటారు. నోటిలో తేమ ఎక్కువగా ఉండటం, ఉష్ణోగ్రత పెరటం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని వల్ల నోరు దుర్వాసన వస్తుందని చెబుతుంటారు. కొవ్వు పదార్థాలు, ఉల్లి, వెల్లుల్లి, మాంసం, గుడ్లు, కాఫీ వంటి పదార్థాలు తీసుకున్నప్పుడు నోరు దుర్వాసన వస్తుందని తెలుసు. నిద్ర లేచిన తరువాత ఎక్కువ సమయం మాట్లాడకుండా ఉండటం, ఎక్కువ సమయం ఆహారానికి దూరంగా ఉండటం వల్ల నోట్లో లాలాజలం తగ్గి నోరు దుర్వాసన రావడం సహజం.
మనలో చాలా మంది చూయింగ్ గమ్ నములుతుంటారు. ఇంకా కొన్ని చిట్కాలు పాటించి నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. నోటి దుర్వాసనతో బాధపడేవారు దంతాలను రెండు పూటలా శుభ్రం చేసుకోవాలి. వేప, చండ్ర, తుమ్మ వంటి పుల్లలతో పళ్లు తోముకుంటే ఫలితం ఉంటుంది. అతి మధురంతో తయారు చేసిన క్యాండీలను చప్పరించాలి. ఇంకా లవంగాలను నోట్లో వేసుకుని కాసేపు చప్పరిస్తే మంచి ఫలితం వస్తుంది. దీని వల్ల లాలాజలం ఊరి నోటి దుర్వాసన దూరం అవుతుంది. ఇంకా జామకాయను కొరికి తింటే కూడా దంతాలకు నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది.

Bad Breath
సోంపు, జీలకర్ర, ఏలక్కాయ, దాల్చిన చెక్కలతో తయారు చేసుకున్న వక్కపొడిని నములుతూ ఉంటే నోటి దుర్వాసన రాకుండా పోతుంది. త్రిఫల చూర్ణానికి వంట సోడా కలిపి కషాయంలా చేసుకుని పుక్కిలిస్తూ ఉంటే నోరు వాసన రావడం తగ్గుతుంది. ఇలా ఈ చిట్కాలు ఉపయోగించి నోటి దుర్వాసనను దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నలుగురిలో ఉండాలంటేనే భయం కలుగుతుంది. నోరు విప్పితే వచ్చే దుర్వాసన వల్ల ఎదుటి వారు ఇబ్బందులు పడతాయి. ఒక సమయంలో వారు వాంతి చేసుకున్నా ఆశ్చర్యం లేదు. నోటి దుర్వాసన అంటే అంత దారుణంగా ఉంటుంది. అందుకే ఈ పరిహారాలు పాటించి నోటి దుర్వాసనను దూరం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.