Paratha: పరాటాలు ఇలా తిని తప్పుచేస్తున్నారంటున్న వైద్యులు..
భారతీయ వంటకాల్లో నెయ్యి ప్రధానమైనంది. రోజూవారీ ఆహారంలో కొన్ని కుటుంబాలు నెయ్యి తప్పనిసరిగా ఉండేలా చూస్తారు. అన్నం నుంచి రోటీ వరకు నెయ్యితో తింటూ మజా చేస్తారు. పాల నుంచి వచ్చిన నెయ్యిలో అనేక పోషకాలు ఉంటాయి.

Paratha: బ్రేక్ ఫాస్ట్ కోసం తొందరగా తయారు చేసుకునే ఆహారంలో పరాటలు ఒకటి. మిగతా వంటకాల కంటే ఈజీగా తయారు చేసుకోవడమే కాకుండా రుచికరమైన రెసిపీ కోసం చాలా మంది పరాటాలపై ఆధారపడుతారు. అయితే పరాటా తయారు చేసేటప్పుడు నెయ్యిని ఉపయోగిస్తాం. నేతితో చేసిన పరాటాలు చాలా రుచిగా ఉంటాయని భావిస్తారు. అంతేకాకుండా పాల నుంచి వచ్చిన నెయ్యిలో అనేక పోషకాలు ఉండడంతో చాలా మంది ఆహారంలోనూ నెయ్యిని ఉపయోగిస్తుంటారు. కానీ పరాటాలో తినేటప్పుడు కొందరు నెయ్యిని ఇలా వాడి తప్పులు చేస్తున్నారని AIMS మాజీ కన్సల్టెంట్ డాక్టర్ బిమల్ ఛజెర్ అంటున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం నెయ్యిని వేడి చేయడం ద్వారా అందులో ఉండే పోషకాలు మాయమవుతాయని చెబుతన్నారు. వారితో పాటు మరికొందరు వైద్యులు ఏం చెబుతున్నారంటే?
భారతీయ వంటకాల్లో నెయ్యి ప్రధానమైనంది. రోజూవారీ ఆహారంలో కొన్ని కుటుంబాలు నెయ్యి తప్పనిసరిగా ఉండేలా చూస్తారు. అన్నం నుంచి రోటీ వరకు నెయ్యితో తింటూ మజా చేస్తారు. పాల నుంచి వచ్చిన నెయ్యిలో అనేక పోషకాలు ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో 130 కేలరీలు ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఈ , కెలు ఉంటాయి. నెయ్యి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. లాక్టోస్ అసహనం ఉన్నవారికి ఇది మంచిది. కాలిన గాయాలు, మచ్చలను నయం చేయడంలో సహాయపడుతుంది. నెయ్యి ఎక్కువగా తినేవారి చర్మం కాంతివంతంగా ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉన్న వారు నెయ్యిని తినాలని వైద్యులు చెబుతున్నారు.
చాలా మంది నెయ్యిని వేడి చేస్తుంటారు. నెయ్యిని వేడి చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు మాయమవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఏయిమ్స్ మాజీ కన్సల్టెంట్ డాక్టర్ ఛజెర్ చెప్పిన వివరాల ప్రకారం.. ‘నెయ్యిని వేడి చేయడం వల్ల దాని పోషకాలను కోల్పోతుంది. అంతేకాకుండా హానికరమైన సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తుంది. పోషకాహారంలో భాగమైన నెయ్యిని వేడి చేయకుండా తినడమే మేలు. అంతేకాకుండా దీనిని మితంగా తీసుకోవడమే మంచిది’ అన్నారు.
గురుగ్రామ్ లోని మారెంగో ఆసియా హాస్పటల్స్ లో సీనయిర్ కన్సల్టెంట్ న్యూట్రిషన్ మరియు డైటిటిక్స్ డాక్టర్ నీతి శర్మ చెబుతున్న ప్రకారం.. ‘ఒక గ్లాసు పాలలో నెయ్యిని కలుపుకోవడం వల్ల గణనీయమైన ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇలా కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ‘ప్రతి రోజూ ఆహార పదార్థాల్లో 20 నుంచి 30 గ్రాముల నెయ్యిని కచ్చితంగా తినాలి. అయితే మాంసాలు, చేపలు, కూరగాయాల్లో నెయ్యి వేసుకోవచ్చు. కానీ డీఫ్ ఫ్రైలో వేయడం అంత మంచిది కాదు.’ అని చెప్పారు.
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినడం ద్వారా అమృత మైన భోజనంలా ఉంటుంది. కొంత మంది రోటీ, పరటాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే దీనిని నేరుగా రసంలా ఉన్నదానినే తినాలని చెబుతున్నారు. నెయ్యిని ప్రత్యేకంగా వేడి చేయడం ద్వారాను దాని సహజత్వం కోల్పోతుందని చెబుతున్నారు. చాలా మంది నెయ్యి గడ్డ కట్టిన తరువాత దానిని వేడి చేస్తారు. అయితే ఇలా వేడి చేసే బదులు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న గదిలో ఉంచి అది రసంలా మారిన తరువాత తీసుకోవాలంటున్నారు. ఇక అన్నంతో పాటు పరాటాలు తినేటప్పుడు వేడి వేడి నెయ్యి వేస్తుంటారు. కానీ నార్మల్ గా ఉండే నెయ్యిని మాత్రమే ఉపయోగించాలని వైద్యులు చెబుతున్నారు.
