Stop Spending Money: ఇటీవల కాలంలో ఎవరిని కదిలించినా ఇంట్లో డబ్బు నిలవడం లేదని చెబుతున్నారు. ఓటీటీలు, ఇతర యాప్ లు వాడకుండా ఉంటేనే మంచిది. అవి వాడితే డబ్బు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. దుబారా ఖర్చును తగ్గించుకుంటునే మనకు లాభం కలుగుతుంది. అనవసరమైన వాటిని కొనుగోలు చేయకపోవడమే బెటర్. ఆ దిశగా ప్రయత్నిస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది. దీంతో మన కుటుంబానికి కావాల్సిన ముఖ్యమైన అవసరాలు మొదట తీర్చుకుని తరువాత ఏమైనా మిగిలితే వాటిని పొదుపు చేయడం మంచిది. దీంతో భవిష్యత్ అవసరాలకు పనికొస్తుంది. అనవసరమైన వాటిని ఎప్పుడు కూడా ప్రాధాన్యం ఇవ్వడం సమంజసం కాదు.

Stop Spending Money
విద్యుత్ బిల్లులు సహా ఇతర ముఖ్యమైన బిల్లులను త్వరగా చెల్లించేందుకు మొగ్గు చూపాలి. ఒకవేళ ఆలస్యం చేస్తే అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తుంది. దీంతో మన బడ్జెట్ రెట్టింపవుతుంది. ఫలితంగా ఇంటి ఖర్చు తడిసి మోపెడవుతోంది. జేబు ఖాళీ కావడం సహజం. వీలైనంత వరకు ఆన్ లైన్ లావాదేవీలు చేసేందుకు ముందుకు రావాలి. ఏటీఎంలలో పరిమితులకు మించి విత్ డ్రాలు తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. బ్యాంకులు ఆలస్యానికి కూడా రుసుం వసూలు చేస్తాయి. దీంతో కూడా మన బడ్జెట్ పెరిగిపోవడం ఖాయం.
క్రెడిట్ కార్డుల బిల్లులు కూడా సకాలంలో కట్టాలి. కాదంటే వాటిపై పెద్ద మొత్తంలో వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డులు వాడకాన్ని అదుపులో ఉంచుకోవాలి. నాలుగైదు బీమాలు తీసుకుని ప్రీమియం చెల్లించడానికి ఇబ్బందులు పడకూడదు. డబ్బు వృథా కాకుండా ఉండేందుకు మనం సిద్దంగా ఉండాలి. మన ఆదాయానికి అనుగుణంగానే మన బీమా పాలసీలు ఉండేలా ప్లాన్ చేసుకుంటే శ్రేయస్కరం. జీవిత బీమాతో పాటు ఆరోగ్య బీమా ఒక్కోటి ఉంటే చాలు.
ఇంట్లో మొబైళ్లు ఉండటం సహజం. రీచార్జీలకు పెద్దమొత్తంలో కట్టాల్సి వస్తోంది. దీంతో మన జేబు ఖాళీ కావడం మామూలే. డేటా కాల్స్ వినియోగానికి అనుగుణంగా రీచార్జీలు ఉంచుకుంటే సరి. కుటుంబసభ్యులతో రెస్టారెంట్ భోజనం, సినిమాలకు వెళ్లడం వంటివి నెలకోసారి అయితే ఫర్వాలేదు కానీ నెలకు రెండు మూడు సార్లు వెళితే బడ్జెట్ పెరుగుతుంది. వారాంతాల్లో, సెలవుల్లో షికార్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటే డబ్బు ఖర్చు ఎక్కువవుతుంది. వ్యక్తిగత వాహనం ప్రస్తుతం అవసరం. గొప్పలకు పోయి లగ్జరీ వాహనాలు కొనుగోలు చేస్తే ఇబ్బందులు తప్పవు.

Stop Spending Money
మార్కెట్ లోకి వచ్చే కొత్త వస్తువులను కొనుగోలు చేయాలని చూడకూడదు. అవసరమైతే తప్ప కొత్త వస్తువులను సొంతం చేసుకోవాలని చూస్తే ఖర్చు ఇనుమడిస్తుంది. దీంతో మన ఖర్చు తడిసిమోపెడవుతుంది. సూపర్ మార్కెట్లకు వెళ్లినప్పుడు ఏది పడితే అది కొనకూడదు. మనకు ఏవి అవసరమో వాటిని తీసుకుంటే డబ్బుకు లోటుండదు.