Swayam Krushi Child Artist: ‘స్వయంకృషి’ చిత్రం లో చిరంజీవి కి కొడుకుగా చేసిన ఈ బుడ్డోడు ఇప్పుడు ఎలా తయారయ్యాడో చూసారా..!
మాస్టర్ అర్జున్ కి చిన్నతనం నుండి క్లాసిక్ డ్యాన్స్ అన్నా, సంగీతం అన్నా ఎంతో ఆసక్తి. చిన్నప్పటి నుండే ఆయన ఎన్నో క్లాసికల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ని స్టేజిల మీద ఇచ్చాడు.

Swayam Krushi Child Artist: మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైన చిత్రం ‘స్వయంకృషి’. కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలను అందుకోవడమే కాకుండా, కమర్షియల్ గా కూడా సూపర్ హిట్ అయ్యింది.ఇందులో చిరంజీవి చెప్పులు కుట్టుకునేవాడి స్థాయి నుండి ఒక ఫ్యాక్టరీ ని నడిపే స్థాయికి ఎలా ఎదిగాడు, మధ్యలో ఆయనకీ ఎదురైనా పరిణామాలు ఏమిటి, సవాళ్లు ఏమిటి అనే అంశాన్ని తీసుకొని ఎంతో గొప్పగా తెరకెక్కించాడు విశ్వనాథ్.
అయితే ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి మరియు చరణ్ రాజ్ తర్వాత చిరకాలం మనకి గుర్తుండిపోయ్యే పాత్ర చిరంజీవి కొడుకు పాత్ర. ఈ క్యారక్టర్ ని మాస్టర్ అర్జున్ చేసాడు. అయితే ఈ సినిమా తర్వాత మాస్టర్ అర్జున్ ఏమయ్యాడు, అతను మళ్ళీ సినిమాల్లోకి వచ్చాడా.అసలు ఇప్పుడు ఆయన ఏమి చేస్తున్నాడు అనే అంశాలను ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాము.
మాస్టర్ అర్జున్ కి చిన్నతనం నుండి క్లాసిక్ డ్యాన్స్ అన్నా, సంగీతం అన్నా ఎంతో ఆసక్తి. చిన్నప్పటి నుండే ఆయన ఎన్నో క్లాసికల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ని స్టేజిల మీద ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషి సూపర్ హిట్ అవ్వగానే, సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘పచ్చని కాపురం’ అనే చిత్రం లో నటించాడు.

Master Arjun
అలా కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా హిందీ, కన్నడ మరియు తమిళ సినిమాల్లో కూడా బాలనటుడిగా నటించి స్టార్ కిడ్ గా ఎదిగాడు. ఇక పెద్దయ్యాక మళ్ళీ సినిమాల్లోకి అడుగుపెట్టి హీరో గా ఎదగాలనే ప్రయత్నం చేసాడు. తొలి సినిమాలో హీరోగా నటించాడు కానీ, అది కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. దీనితో ఆయన సినీ రంగాన్ని వదిలి ప్రస్తుతం డాక్టర్ వృత్తిలోనే కొనసాగుతున్నాడు.ఆయనకీ సంబంధించిన ఫోటో ఒకటి అందిస్తున్నాము చూడండి.
