Varun Tej Lavanya Tripathi Marriage: ఇంతకీ వరుణ్ తేజ్ కట్నం ఎంత తీసుకున్నాడో తెలుసా?
వరుణ్ తేజ్, లావణ్యలు ఇద్దరూ సినీ ఇండస్ట్రీకి చెందిన వారే. 2017లో మొదలైన వీరి ప్రేమ ఐదేళ్లపాటు కొనసాగింది. ఆ తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసున్నారు.

Varun Tej Lavanya Tripathi Marriage: మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్యల వివాహం అంగరంగ వైభవంగా సాగింది. మెగా ఫ్యామిలీతో పాటు అతికొద్ది మంది సినీ సెలబ్రెటీల సమక్షంలో ఇటలీలోని సియోనా బోర్గో శాన్ ఫెలిన్ రిసార్ట్ లో వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు. నవంబర్ 1న జరిగిన ఈ వివాహానికి ముందే ఇండియా నుంచి మెగా కుటుంబం బయలు దేరింది. నవంబర్ 1న సాంప్రదాయ పద్ధతుల్లో వివాహం జరిపించారు. ఈ వివాహం పూర్తయిన తరువాత మెగా ఫ్యామిలీ అంతా సంతోషంగా గడిపారు. అందుకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ ఎంత కట్నం తీసుకున్నారు? అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
వరుణ్ తేజ్, లావణ్యలు ఇద్దరూ సినీ ఇండస్ట్రీకి చెందిన వారే. 2017లో మొదలైన వీరి ప్రేమ ఐదేళ్లపాటు కొనసాగింది. ఆ తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసున్నారు. నార్త్ కు చెందిన లావణ్య సౌత్ కుచెందిన వరుణ్ తో ప్రేమలో పడి.. ఆ తరువాత జీవితాంతం కలిసుండడానికి ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. దీంతో తన కుటుంబ సభ్యులను ఒప్పించి ఈ పెళ్లికి రెడీ అయింది. అయితే ఈ విషయా్ని ఎక్కడా బయటకు రానివ్వలేదు. జూన్ 9న ఒకేసారి నిశ్చితార్థం అంటూ బయటకు రావడం హల్ చల్ గా మారింది. ఆ సమయంలో పెళ్లి ఎప్పుడు అనేది సస్పెన్స్ గా పెట్టి మొత్తానికి కొన్ని రోజుల కిందట డేట్ ను అనౌన్స్ చేశారు.
ఈ క్రమంలో అక్టోబర్ చివరి వారంలోనే ఇటలీకి నాగబాబు కుటుంబంతో పాటు లావణ్య ఫ్యామిలీ ఇటలీ వెళ్లింది. ఆ తరువాత ఒక్కొక్కరు ఇటలీకి వెళ్లిన విషయం సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. నవంబర్ 1న గ్రాండ్ గా వివాహాన్ని జరిపించారు. ఆ తరువాత లావణ్, వరుణ్ తేజ్ కలిసున్న ఫొటోలు బయటకువ వచ్చాయి. ఇందులో కొత్త జంట ఎంతో సంతోషంగా కనిపించింది. లావణ్య పెళ్లికూతురు గెటప్ లో ఎంతో అందంగా కనిపించింది.
ఈ నేపథ్యంలో ఈ పెళ్లికి వరుణ్ తేజ్ ఎంత కట్నం తీసుకున్నారు? అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే కొన్ని వైపుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం లావణ్య కుటుంబం నుంచి వరుణ్ తేజ్ ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ పెళ్లికి అయిన ఖర్చు మొత్తం నాగబాబు కుటుంబమే భరించినట్లు సమాచారం. పైగా లావణ్య తన ప్రేమను యాక్సెప్ట్ చేసినందుకు ఖరీదైన గిప్ట్ ను కూడా కొనుగోలు చేసినట్లుసమాచారం. లావణ్య మీద ఉన్న ప్రేమతోనే వరుణ్ తేజ్ కట్నం తీసుకోలేదని తెలుస్తోంది.
