Tiktok Tharun: వామ్మో.. టిక్ టాక్ తరుణ్ నెల సంపాదన ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!
తద్వారా ఫేమస్ అయిపోయిన సెలెబ్రిటీలు లాక్ డౌన్ సమయం లో టిక్ టాక్ ని ఇండియా బ్యాన్ చెయ్యగానే ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. ఆ తర్వాత ఇంస్టాగ్రామ్ రీల్స్ లోకి అడుగుపెట్టి మళ్లీ తమ సంపాదన ని స్థిరపర్చుకున్నారు.

Tiktok Tharun: సోషల్ మీడియా ని సరిగ్గా ఉపయోగించుకుంటే సెలెబ్రటీలు అయిపోవచ్చు, లక్షల లక్షల రూపాయలు సంపాదించొచ్చు అని ఇది వరకు ఎంతో మంది నిరూపించారు. కేవలం సోషల్ మీడియా ని నమ్ముకొని జీవితం లో స్థిరపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా టిక్ టాక్ లో విచిత్రమైన వీడియోస్ చేసే వారికి మిలియన్ల కొద్దీ లైక్స్ వచ్చేవి.
తద్వారా ఫేమస్ అయిపోయిన సెలెబ్రిటీలు లాక్ డౌన్ సమయం లో టిక్ టాక్ ని ఇండియా బ్యాన్ చెయ్యగానే ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. ఆ తర్వాత ఇంస్టాగ్రామ్ రీల్స్ లోకి అడుగుపెట్టి మళ్లీ తమ సంపాదన ని స్థిరపర్చుకున్నారు. అలా కేవలం ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా జీవనం గడుపుతున్న సెలబ్రిటీస్ లో ఒకరు తరుణ్. ఇతనిని అందరూ టిక్ టాక్ తరుణ్ అని పిలుస్తూ ఉంటారు, ఇతను పెట్టే వీడియోస్ కి సోషల్ మీడియా లో సెన్సషనల్ రెస్పాన్స్ వస్తూ ఉంటుంది.
ముఖ్యంగా ఇతను వేసే కాస్ట్యూమ్స్ ద్వారా బాగా హైలైట్ అయ్యాడు. న్యూస్ పేపర్స్, పానీ పూరీలు, కూరగాయలు, ఇలా చేతికి ఏది దొరికితే దానితో ఆడపిల్లల కాస్ట్యూమ్స్ లాగ తయారు చేసుకొని ఆడవాళ్ళ పాటలకు ఎగురుతూ ఉంటాడు. వీటికి లక్షల సంఖ్యలో వ్యూస్ రావడం తో నెలవారీ సంపాదన భారీ గానే ఆర్జిస్తున్నాడు.రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన కుటుంబ కష్టాల గురించి చెప్పుకున్నాడు.
నాన్న కరెంటు షాక్ కొట్టి చనిపోయాడని, అప్పటి నుండి ఇంటి బాధ్యత మొత్తం నేనే తీసుకున్నానని, అమ్మకి కూడా ఆరోగ్యం బాగాలేకపోతే ప్రస్తుతం చికిత్స చెయ్యిస్తున్నాని, నెలకి తనకి యావరేజి గా అన్నీ కలుపుకొని 70 వేల రూపాయిల వరకు వస్తుందని, వాటిల్లోనే మొత్తం మ్యానేజ్ చేస్తున్నాని చెప్తున్నాడు తరుణ్. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి కి వస్తున్నంత డబ్బు టిక్ టాక్ ద్వారా వస్తుందా అని తెలుసుకొని నెటిజెన్స్ నోరెళ్లబెడుతున్నారు.
