Silk Smitha: సిల్క్ స్మిత తిన్న యాపిల్.. వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా?
సిల్క్ స్మితను చూస్తే ఒక రకమైన ట్రాన్స్ లోకి వెళ్తారు కొందరు. ఇక ఆమె ఐటం సాంగ్స్ కు ఉన్న ఫ్యాన్స్ గురించి చెప్సాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోహీరోయిన్ లకు మించిన క్రేజ్ ను సంపాదించింది ఈ అమ్మడు.

Silk Smitha: సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పటి హీరోయిన్ అయినా కూడా ఎంతో మంది మదిలో నిలిచిపోయింది ఈ అమ్మడు. అప్పటి ప్రేక్షకుల మదిలోనే కాదు ఇప్పటి ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈమె మరణించిన తర్వాత ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగితేలారు. 1970-80లో తెలుగులోనే కాదు మొత్తం ఇండియాలోనే తన అందంతో మంచి నటిగా పేరు సంపాదించి ఎంతో మందిని ఆకట్టుకున్న అమ్మడు సిల్క్ స్మిత. ఆమె ఒక సినిమాలో చేస్తుందంటే కచ్చితంగా ఆ సినిమాను చూడకుండా వదిలిపెట్టరు ఆమె అభిమానులు.
సిల్క్ స్మితను చూస్తే ఒక రకమైన ట్రాన్స్ లోకి వెళ్తారు కొందరు. ఇక ఆమె ఐటం సాంగ్స్ కు ఉన్న ఫ్యాన్స్ గురించి చెప్సాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోహీరోయిన్ లకు మించిన క్రేజ్ ను సంపాదించింది ఈ అమ్మడు. అంతేకాదు ఈమె ఏదైనా సినిమాలో కనిపిస్తుందంటే దర్శకనిర్మాతలు కూడా ఆ సినిమా హిట్ అనే అంచనా వేస్తుండేవారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో కొవ్వలిలో పుట్టిన సిల్క్ కేవలం నాలుగో తరగతి మాత్రమే చదువుకుంది. అయితే తల్లిదండ్రి పెళ్లి చేస్తాను అని చెప్పడంతో ఇంట్లో నుంచి పారిపోయి మద్రాసు చేరిందట.
అలా వచ్చిన వడ్లపట్ల విజయలక్ష్మీ సిల్క్ స్మితగా ఇండస్ట్రీలో పరిచయం అయింది. సినిమాల్లో కనిపించాలనే తన కోరికను బలంగా చేసుకొని ఏకంగా ఎంతో మంది గుండెల్లో చోటు సంపాదించింది. ఇదంతా ఇలా ఉంటే 1984లో ఓ సారి షూటింగ్ సమయంలో సిల్క్ స్మిత బ్రేక్ సమయంలో యాపిల్ తింటుంది. అదే సమయంలో డైరెక్టర్ షాట్ రెడీ అనగానే తినే యాపిల్ ను వదిలేసి వెళ్లిపోయిందట. అంతే అప్పుడే అక్కడే ఆ యాపిల్ కు వేలం వేస్తే.. దాన్ని దక్కించుకోవడానికి పెద్ద పోటీ జరిగిందట. చివరకు 26వేలకు ఒక వ్యక్తి దాన్ని కొనుక్కున్నారు.
ఆ రోజుల్లో ఈ మొత్తం పెద్ద మొత్తమే.. ఈ 26000 రూపాయలు లక్షతో సమానం. దీన్ని బట్టి సిల్క్ స్మితకు అప్పట్లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు టచ్ ఆఫ్ గర్ల్ కాస్త దర్శకనిర్మాతలు డేట్స్ కోసం ఎదురుచూసే స్థాయి వరకు వెళ్లింది అంటే కూడా అర్థం చేసుకోవచ్చు స్మిత రేంజ్. కానీ చివరకు ఈమె జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఈ అమ్మడు ఆత్మహత్య చేసుకొని మరణించడంతో అందరూ అయోమయంలో పడ్డారు.
ఈ అమ్మడు తొలిసారిగా 1981లో తమిళ చిత్రం వండిక్కక్కరంలో సిల్క్ పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో ఆమె సిల్క్ అనే అమ్మాయిగా నటించింది. ఆ సినిమా హిట్ అయ్యాక విజయక్ష్మి అదృష్టం మారిపోయింది. సినీ పరిశ్రమలో పేరు కూడా సిల్క్ స్మితగా మారిపోయింది. చెన్నైలోని ప్రముఖ ఏవీఎం స్టూడియో దగ్గర స్మిత డ్యాన్స్‌ని వీక్షించిన దర్శకుడు విను చక్రవర్తి ఆమె ప్రతిభకు న్యాయం చేసేందుకు కృషి చేశారు. దర్శకుడు తన భార్య దగ్గర సిల్క్ స్మితకు నటన, డ్యాన్స్‌లో శిక్షణ ఇచ్చి పూర్తి స్థాయి ఆర్టిస్ట్‌గా తీర్చిదిద్దారు.
