Sreeleela Remuneration: రేటు పెంచేసిన శ్రీలీల మెగా హీరోలకు కూడా అందనంతగా!
రవితేజకు శ్రీలీల వంటి యంగ్ హీరోయిన్ అవసరమా? ఆయనకు కూతురులా ఉంటుందని ఎద్దేవా చేశారు. అయితే సిల్వర్ స్క్రీన్ పై ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతం చేసింది. లుక్స్, ఎనర్జీ, డాన్స్ శ్రీలీలకు కలిసొస్తున్న అంశాలు.

Sreeleela Remuneration: పట్టుమని పది సినిమాలు చేయలేదు. టాలీవుడ్ సెన్సేషన్ గా అవతరించింది హీరోయిన్ శ్రీలీల. ఈ కన్నడ భామ 2019లో కిస్ చిత్రంతో సొంత పరిశ్రమలో ప్రస్థానం మొదలు పెట్టింది. పెళ్లి సందడి(2021)తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. పెళ్లిసందడి యావరేజ్ టాక్ తో బయటపడింది. శ్రీలీల మాత్రం కుర్రాళ్ల మదిలో రిజిస్టర్ అయ్యింది. వెంటనే రవితేజ ఆఫర్ ఇచ్చాడు. ధమాకా చిత్రంలో హీరోయిన్ గా చేసింది. విడుదలకు ముందు ఈ కాంబో ట్రోల్స్ కి గురైంది.
రవితేజకు శ్రీలీల వంటి యంగ్ హీరోయిన్ అవసరమా? ఆయనకు కూతురులా ఉంటుందని ఎద్దేవా చేశారు. అయితే సిల్వర్ స్క్రీన్ పై ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతం చేసింది. లుక్స్, ఎనర్జీ, డాన్స్ శ్రీలీలకు కలిసొస్తున్న అంశాలు. తానేంటో ఇంకా పూర్తిగా నిరూపించుకోలేదు. ఒక్క హిట్టుకే టాలీవుడ్ ఆమెకు దాసోహం అంది. ఒకటా రెండా ఏకంగా 7 తెలుగు సినిమాలు చేస్తుంది. మహేష్ తో గుంటూరు కారం చేస్తున్న శ్రీలీల, బాలయ్య భగవాన్ కేసరి మూవీలో కీలక రోల్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో మెయిన్ హీరోయిన్.
ఆదికేశవ, స్కంద, నితిన్ 32, విజయ్ దేవరకొండ 12వ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. మరి డిమాండ్ ఉన్నప్పుడు రెమ్యునరేషన్ విషయంలో ఎందుకు తగ్గుతారు. మొన్నటి వరకు యాభై లక్షలు లోపే తీసుకున్న శ్రీలీల కోటిన్నర అడుగుతుందట. దాంతో మేకర్స్ బెంబేలెత్తుతున్నారట. మీడియం బడ్జెట్ చిత్రాలకు శ్రీలీల అందడం లేదట. వారి అంచనాలు దాటేసిందట.
సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు సంపత్ నంది ఒక మూవీ చేయనున్నారని సమాచారం. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందట. మొదట శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారట. ఆమె భారీగా డిమాండ్ చేస్తున్న క్రమంలో ఆమె స్థానంలో పూజా హెగ్డేను తీసుకున్నారట. శ్రీలీలకు రెండు కోట్లు ఇచ్చే కంటే పూజా హెగ్డేను పెట్టుకోవడం బెటర్ అనుకున్నారట. పరాజయాల నేపథ్యంలో పూజా కూడా రెమ్యునరేషన్ తగ్గించారని తెలుస్తుండగా, సాయి ధరమ్-పూజా హెగ్డే కలిసి నటిస్తున్నారని టాలీవుడ్ టాక్. శ్రీలీల రెమ్యూనరేషన్ మాత్రం హాట్ టాపిక్ అవుతుంది.
