Simhadri Re Release Event: ‘సింహాద్రి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా..! రీ-రిలీజ్ కి ఇంత హుంగామ అవసరమా?
అప్పటి నుండి ఎలా అయినా రికార్డు కొట్టాలనే ఆశతో ఇష్టమొచ్చినట్టు షోస్ వేసుకోవడం, దీని గురించి సోషల్ మీడియా లో అభిమానులు మా హీరో గొప్ప అంటే,మా హీరో గొప్ప అంటూ గొడవలు వేసుకోవడం వంటివి మనం గమనిస్తూనే ఉన్నాం.

Simhadri Re Release Event: స్టార్ హీరోల సినిమాలలో మైలు రాయిగా నిల్చిపోయిన కొన్ని చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ ఉంటారు అభిమానులు. కేవలం ఆ రోజుల్లో అభిమానులు పొందిన మధురానుభూతులను స్మరించుకుంటూ మరొక్కసారి థియేటర్స్ లో ఎంజాయ్ చెయ్యడానికి స్టార్ హీరోల పుట్టిన రోజు సమయం లో విడుదల చేస్తూ ఉంటారు. ఈ రీ రిలీజ్ ద్వారా వచ్చిన డబ్బులు మొత్తాన్ని హీరో పేరిట మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉంటారు.
ఇంత గొప్ప ఉద్దేశ్యం కోసం ఈ రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహిస్తూ ఉంటారు ఫ్యాన్స్. కానీ ఈమధ్య ఈ రీ రిలీజ్ వ్యవహారం చాలా ప్రెస్టీజియస్ గా మారింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఖుషి, జల్సా మరియు మహేష్ బాబు పోకిరి చిత్రాలు ఆల్ టైం రికార్డ్స్ పెట్టాయో , అప్పటి నుండి ఇతర హీరోల అభిమానులకు ఎలా అయినా ఈ రికార్డ్స్ ని బద్దలు కొట్టాలి అనే కసి ఏర్పడింది.
అప్పటి నుండి ఎలా అయినా రికార్డు కొట్టాలనే ఆశతో ఇష్టమొచ్చినట్టు షోస్ వేసుకోవడం, దీని గురించి సోషల్ మీడియా లో అభిమానులు మా హీరో గొప్ప అంటే,మా హీరో గొప్ప అంటూ గొడవలు వేసుకోవడం వంటివి మనం గమనిస్తూనే ఉన్నాం. ఒక మంచి పని కోసం చేసే కార్యక్రమం కాస్త కమర్షియల్ అయిపోయింది, హీరోల పాలిట ప్రెస్టీజియస్ గా మారింది. ఈ నెల 20 వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సింహాద్రి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రం రీ రిలీజ్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు నందమూరి ఫ్యాన్స్. అందుకే కొత్త సినిమాకి చేస్తున్నట్టుగా, రీ రిలీజ్ కి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ కి విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం దాదాపుగా 20 లక్షల రూపాయిలు ఖర్చు చేసినట్టు సమాచారం. చూస్తూ ఉంటే ఈ సినిమాకి వచ్చే వసూళ్లకంటే చేస్తున్న పబ్లిసిటీ బిల్లు ఎక్కువ అయ్యేలా ఉంది అని ట్రేడ్ పండితులు సెటైర్లు వేస్తున్నారు.
