Urination: స్వీకరణతోపాటు విసర్జన ముఖ్యమే.. ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకి ఎన్నిసార్లు ముత్ర విసర్జన చేస్తారో తెలుసా..?
లివర్ మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. కిడ్నీలు రక్తాన్ని వడపోస్తాయి. మెదడు మనకు వచ్చే సందేశాలు చెబుతుంది. ఇలా మన శరీరంలో ప్రతి అవయవం దానికి సంబంధించిన పనులు చేస్తుంటుంది.

Urination: మనిషి స్వీకరించే శక్తి ఎలా ఉంటుందో.. విసర్జించే ప్రక్రియ కూడా అలాగే ఉండాలి. లేకుంటే వ్యర్థాలు శరీరంలో పేరుకుపోతాయి. వ్యాధులకు కారణమవుతాయి. అవయవాలను దెబ్బతీస్తాయి. మన శరీరంలోని విసర్జక అవయవాలు సక్రమంగా పనిచేస్తే.. విసర్జన సక్రమంగా జరుగుతుంది. చర్మం చమట రూపంలో.. యూరినల్, మోషన్ రూపంలో వ్యర్థాలు బయటకు వెళ్తుంటాయి. అయితే యూరిన్ విసర్జన మనిషితోపాటు ప్రతీ జీవికి ముఖ్యమే. మనం జీవించడానికి రోజూవారీగా ఆహారం, నీరు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆ తీసుకున్న వాటి నుండి ఉత్పన్నమయ్యే వ్యర్థాలను బయటకు పంపడం అంతే కీలకం. మనం రోజూ తీసుకునే నీరు సహా ఇతర ద్రవపదార్థాలను శరీరంలోని వ్యవస్థలు చెమట, మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. అయితే మన శరీరంలో ఎన్నో రకాల చర్యలు జరుగుతుంటాయి. ఏ అవయవమైనా దానికి సంబంధించిన విధులు నిర్వహిస్తుంటుంది.
విసర్జన ఇలా..
లివర్ మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. కిడ్నీలు రక్తాన్ని వడపోస్తాయి. మెదడు మనకు వచ్చే సందేశాలు చెబుతుంది. ఇలా మన శరీరంలో ప్రతి అవయవం దానికి సంబంధించిన పనులు చేస్తుంటుంది. మన శరీరంలోని మలినాలను మూత్రం, మలం రూపంలో మన శరీరం బయటకు పంపుతుంది. దీంతో మూత్రం విషయంలో చాలా మందికి తెలియని విషయలు ఉన్నాయి.
మూత్రం ఎన్నిసార్లు పోయాలంటే..
రోజుకు మనం ఎన్నిసార్లు మూత్రం పోయాలి అంటే మనకు తెలియదు. కానీ రోజుకు మనం ఏడు సార్లు మూత్రం పోయాలట. అంతకంటే తక్కువగా పోసినా ఎక్కువగా పోసినా మనకు ఏదో జరుగుతుందని అర్థం. మూత్ర విసర్జన గురించి నిజాలు తెలుసుకోవాలి. లేకపోతే మనకు ఏదైనా నష్టం జరిగినట్లు అనుకుంటారు. మనం ఆరోగ్యంగా ఉన్నామని అనుకోవాలి.
ఎంత సేపు పోయాలి..
మూత్రం ఎంత సేపు పోయాలి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మూత్ర విసర్జన కాలం దాదాపు 7 సెకండ్లు. 2 సెకండ్ల కంటే తక్కువగా మూత్రం పోస్తే వారికి ఇన్ఫెక్షన్‌ఉన్నట్లు తెలుస్తోంది. మూత్రం రంగు మారితే అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే మూత్రం పోసే సమయంలో రంగు చూసుకోవాలి. తెలుపు రంగులో వస్తుంటే మనం నీళ్లు బాగా తాగుతున్నామని అర్థం.
మూత్రం రంగు మారితే..
మనం తీసుకునే ఆహారం జీర్ణంచేసే క్రమంలో పోషకాలను గ్రహించి వాటిని విడగొట్టి వ్యర్థాలను మూత్రం, మలం రూపంలో బయటకు పంపుతుంది. మూత్రం రంగును బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మూత్రం ఎరుపు రంగులో ఉంటే మూత్రంలో రక్తం కలిసిందని తెలుసుకోవాలి. పసిపిల్లలో సమస్యలు ఉంటే నీలం రంగులో ఉంటుంది. దీనికి జన్యులోపం అని తెలుసుకోవాలి.
