KL Rahul Marriage: పూర్వపు రోజుల్లో అంటే తల్లిదండ్రులు చూస్తే, వాళ్లు ఓకే చేస్తే పిల్లలు పెళ్లి చేసుకునేవారు.. తర్వాత కాలం మారింది. ఇప్పుడు పిల్లలు ఓకే చేస్తే, తల్లిదండ్రులు పెళ్లికి తలుపాల్సి వస్తోంది.. మార్పు నిత్యం, మార్పు సత్యం, మార్పు శాశ్వతం కాబట్టి.. ఇది మానవ సంబంధాలకు కూడా వర్తిస్తుంది.. ఇక ఈ ప్రేమ పెళ్లి చేసుకున్న జాబితాలోకి టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ రాహుల్ కూడా చేరాడు.. అతడు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు.. ఈ క్రమంలో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ప్రేమకు శుభం కార్డు పెళ్లే కాబట్టి… ఈ ఇద్దరు ఇటీవల పెళ్లి చేసుకున్నారు.

KL Rahul Marriage
ఇక రాహుల్, అతియా వివాహం సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది.. సునీల్ శెట్టి కి చెందిన ఒక ప్యాలెస్ లో వీరి వివాహ తంతు సాగింది.. వచ్చిన అతిధులకు శాఖాహార, మాంసాహార వంటకాలు చూపించారు. దీనికోసం ముంబైలోని టాప్ చెఫ్ లను తీసుకొచ్చారు. ఆహార పదార్థాలకు సంబంధించి ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడలేదు.. వెజ్ మెనూలో సుమారు 40 వరకు వెరైటీలు సర్వ్ చేశారని తెలుస్తోంది.. ఇక నాన్ వెజ్ లో అయితే ఆ సంఖ్య 50 వరకు ఉందని సమాచారం.

KL Rahul Marriage
రెండు రోజులు గా వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ప్రముఖులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.. అంతేకాదు వీరి పెళ్లికి వచ్చిన బహుమతులపై కూడా నెట్టింట పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.. సునీల్ శెట్టి తన కుమార్తెకు పెళ్లి బహుమతిగా ముంబైలోని విలాసవంతమైన ఫ్లాట్ ను బహుమతిగా ఇచ్చాడు.. దీని విలువ 50 కోట్లు ఉంటుందట. ఇక సునీల్ శెట్టి క్లోజ్ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్ ఈ కొత్త జంటకు 1.64 కోట్లు విలువచేసే ఆడి కార్ గిఫ్ట్ గా ఇచ్చాడని సమాచారం. అతియా కు జాకీష్రాఫ్ 30 లక్షల విలువ చేసే చేతి గడియారాన్ని బహుమతిగా ఇచ్చాడు. అర్జున్ కపూర్ వజ్రాల హారాన్ని ఇచ్చాడు. విరాట్ కోహ్లీ బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇచ్చాడు.. ధోని ఒక బైకును గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక అతియా, రాహుల్ ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ కోసం ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించనున్నారు.. ఐపీఎల్ ముగిసిన తర్వాత క్రికెటర్లకు విందు ఇవ్వనున్నారు.. ఇందుకు సంబంధించి వివరాలు త్వరలో వెల్లడిస్తామని సునీల్ శెట్టి వివరించారు.