Chiranjeevi Annayya Movie: ఆరోజుల్లో చిరంజీవి ‘అన్నయ్య’ చిత్రం ఇన్ని కోట్లు రాబట్టిందా.. ఇది మామూలు మాస్ కాదు!
ముఖ్యంగా ఈ చిత్రం లోని పాటలు, మరియు చిరంజీవి అద్భుతమైన కామెడీ టైమింగ్ ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. చిరంజీవి అంతకు ముందు కూడా కామెడీ చేసాడు కానీ, అన్నయ్య చిత్రం లోని కామెడీ మాత్రం ఎంతో స్పెషల్. చాలా సహజమైన నటన తో చిరంజీవి పుట్టించిన కామెడీ అప్పట్లో ఆడియన్స్ ని తెగ ఎంటర్టైన్ చేసింది. ఈ సినిమా ఎప్పుడు టీవీ లో టెలికాస్ట్ అయినా మంచి టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకుంటూనే ఉంటుంది.

Chiranjeevi Annayya Movie: మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు మరియు ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఉండొచ్చు. కానీ ఆయన అభిమానులు మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఇష్టపడే సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో అన్నయ్య అనే చిత్రం ఒక్కటి. 2000 సంవత్సరం జనవరి నాల్గవ తేదీన విడుదలైన ఈ సినిమా అప్పట్లో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.
ముఖ్యంగా ఈ చిత్రం లోని పాటలు, మరియు చిరంజీవి అద్భుతమైన కామెడీ టైమింగ్ ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. చిరంజీవి అంతకు ముందు కూడా కామెడీ చేసాడు కానీ, అన్నయ్య చిత్రం లోని కామెడీ మాత్రం ఎంతో స్పెషల్. చాలా సహజమైన నటన తో చిరంజీవి పుట్టించిన కామెడీ అప్పట్లో ఆడియన్స్ ని తెగ ఎంటర్టైన్ చేసింది. ఈ సినిమా ఎప్పుడు టీవీ లో టెలికాస్ట్ అయినా మంచి టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకుంటూనే ఉంటుంది.
అయితే ఈ సినిమాకి పోటీగా అప్పట్లో విక్టరీ వెంకటేష్ ‘కలిసుందాం రా’ చిత్రం కూడా విడుదలైంది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది, సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్ కి జనాలు ఎక్కువ కదులుతారు కాబట్టి, అన్నయ్య చిత్రం కంటే ‘కలిసుందాం రా’ చిత్రానికి ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఇక పోతే అన్నయ్య సినిమాకి అప్పట్లో దాదాపుగా 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది అప్పట్లో ఆల్ టైం టాప్ 2 రికార్డుగా చెప్పుకోవచ్చు. అప్పటి వరకు సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న చిరంజీవి కి మరియు ఆయన అభిమానులకు ఈ సినిమా ఇచ్చిన కిక్ మామూలుది కాదు.
అంతే కాదు ఈ చిత్రం ఆరోజుల్లో 94 సెంటర్స్ లో అర్థ శత దినోత్సవం, 60 సెంటర్స్ లో శత దినోత్సవం, మరియు 1 కేంద్రం లో 175 రోజులు ఆడింది. అప్పట్లో ఇది ఒక రికార్డు, చిరంజీవి ని మళ్ళీ ఈ రేంజ్ కామెడీ టైమింగ్ లో చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మరి రాబొయ్యే సినిమాలతో ఆయన రేంజ్ కామెడీ టైమింగ్ ని అందుకుంటారో లేదో చూడాలి.