Chiranjeevi Movies: తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి..వారసులను ఎంతో మంది ఇండస్ట్రీ లో దాటుకొని మెగాస్టార్ గా, నెంబర్ 1 హీరో గా మూడు దశాబ్దాల నుండి కొనసాగుతూనే ఉన్నాడు..మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి 9 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీ కి దూరం అయినప్పటికి కూడా చిరంజీవి ఇమేజి ఇసుమంత కూడా తగ్గలేదు అనడానికి ఉదాహరణ ఖైదీ నెంబర్ 150 చిత్రం..రీ ఎంట్రీ ఇస్తూ మెగాస్టార్ చేసిన ఈ సినిమా అప్పట్లో బాహుబలి తర్వాత వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టిన ఏకైక తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది..ఇక ఆ తర్వాత మెగాస్టార్ చేసిన సైరా నారాసింహా రెడ్డి చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయంగా నిలిచింది..కానీ ఇటీవల విడుదలైన ఆచార్య సినిమా మాత్రం మెగాస్టార్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..ఈ సినిమా అలా డిజాస్టర్ అవ్వడానికి కారణం ఒక సెంటిమెంట్ ఉందని గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా లో గట్టిగ వినిపిస్తుంది.

Chiranjeevi
Also Read: Upendra-Mahesh Babu: ఉపేంద్ర మహేష్ తో అందుకే ఒప్పుకున్నాడు !
ఇక అసలు విషయానికి వస్తే చిరంజీవి కెరీర్ లో తెలుగులోని రెండవ అక్షరం ‘ఆ’ తో విడుదలైన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి అట..ఆయన మొదటి సినిమా కూడా ‘ఆ ‘ తోనే మొదలు కావడం విశేషం..అప్పట్లో ‘ఆరని మంటలు’ అనే సినిమా విడుదలై భారీ ఫ్లాప్ గా నిలిచింది..ఈ సినిమా ద్వారానే చిరంజీవి ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు..ఇక ఆ తర్వాత ఆయన చేసిన ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ అనే సినిమా కూడా యావేరేజి గా ఆడింది..ఇందులో చిరంజీవి ఒక చిన్న పాత్ర చేసాడు..ఇక హీరోగా ఇండస్ట్రీ లో నిలదొక్కుకుంటున్న సమయం లో ఆయన చేసిన ‘ఆలయ శిఖరం’ అనే సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా ఆడలేదు..అంతే కాకుండా అప్పట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రముఖ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన ‘ఆరాధన’ అనే సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది..కానీ నటుడిగా చిరంజీవి ని వేరే స్థాయికి తీసుకెళ్లింది ఈ సినిమా..అలాగే మెగాస్టార్ కి నటుడిగా అవార్డులు తెచ్చిపెట్టిన సినిమా ‘ఆపద్బాంధవుడు’ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు..అప్పుడు లేటెస్ట్ గా ‘ఆచార్య’ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇలా మెగాస్టార్ కెరీర్ లో ‘ఆ’ అనే అక్షరం పెద్ద శాపం లాగ మారిపోయింది అనే చెప్పాలి.
Also Read: Pawan Janavani: ప్రభుత్వ బాధిత వర్గాలకు అండగా ‘జనవాణి’..పవన్ కు వినతుల వెల్లువ
Recommended Videos