Badam Health Benefits: మనకు ప్రకృతిసిద్ధమైన ఆహారాలను ఎన్నింటినో ఇచ్చింది. మనం వాటికి బదులు వేరే వాటిని తీసుకుంటున్నాం. ఫలితంగా అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాం. ప్రకృతి పరంగా లభించే వాటిలో పోషకాలు మెండుగా ఉంటాయి. దీంతో మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు దక్కుతాయి. కానీ ఇటీవల కాలంలో ఆధునిక జీవనశైలికి అలవాటు పడి మంచి ఆహారాలను పట్టించుకోవడం లేదు. దీంతో పలు రకాల సమస్యలను కొనితెచ్చుకుంటున్నాం. నూట యాభై ఏళ్లు జీవించాల్సిన శరీరాన్ని గుల్లగా చేసుకుంటున్నాం. దీనికి కారణం మన చేతలే కావడం గమనార్హం.

Badam Health Benefits
ప్రకృతి సిద్ధమైన ఆహారాలేవి?
ప్రకృతి సిద్ధమైన ఆహారాల్లో పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, నట్స్, ధాన్యాలు ఉన్నాయి. వీటిని నిరంతరం తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్య లాభాలు ఎన్నో ఉంటాయి. మన ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే రోజు రెండు పూటలు ఉడకని ఆహారాలు అంటే ప్రకృతి సిద్ధమైనవి తీసుకుంటే ఎంతో మంచిది. కానీ అందరు ఉడికిన ఆహారాలకే మొగ్గు చూపుతున్నారు. ప్రకృతి సిద్ధమైన ఆహారాల్లో డ్రై ఫ్రూట్స్ ముఖ్యమైనవి. ఇందులో బాదం ఎంతో శ్రేష్టమైనది. బాదంతో మనకు కలిగే లాభాలెన్నో ఉన్నాయి.
బాదంలో ఏ పోషకాలు ఉన్నాయి?
విటమిన్ ఇ. జింక్, ఫొలేట్, మెగ్నిషియం, పాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు ఉన్నాయి. దీంతో బాదం మన శరీరానికి మేలు చేస్తుంది. రోజు వారీ ఆహారంలో బాదంను చేర్చుకోవడం వల్ల మన శరీరానికి ప్రొటీన్లు అందుతాయి. గుండె జబ్బులను నయం చేసే కారకాలను ఉత్పత్తి చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బాదంలను తరచుగా తీసుకుంటే మన ఆరోగ్య పరిరక్షణకు ఎంతో సాయపడతాయి. చెడు కొవ్వులను కరిగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇలా బాదంలను తీసుకోవడం అందరికి మంచిదే.
బాదంను తీసుకోవడం వల్ల ఏ ప్రయోజనాలు దక్కుతాయి
బరువు నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారు బాదంలను తీసుకోవడం ఉత్తమం. ఇందులో ఉండే ప్రొటీన్లతో అధిక బరువు సమస్యను దూరం చేస్తాయి. మధుమేహం ఉన్న వారు మాత్రం పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. పెద్దవారు అయితే ఎనిమిది నుంచి పది పిల్లలైతే నాలుగు నుంచి ఆరు తింటే చాలు. ఎక్కువగా తీసుకుంటే సమస్యలు వస్తాయి. దీంతో వారు కూడా వైద్యుడి సలహా మేరకే తీసుకుంటూ ఉండాలి. మన ఇష్టానుసారం తీసుకుంటే ఇతర సమస్యలకు దారి తీస్తుంది. మధుమేహం ఉన్న వారు బాదంలను అవసరం మేరకే తీసుకుంటే లాభాలుంటాయి.

Badam Health Benefits
బాదంలను ఎలా తినాలి?
బాదంలను నేరుగా కాకుండా నానబెట్టినవి తింటే మంచి ఫలితాలు వస్తాయి. నానబెట్టిన బాదంలలో పోషకాలు మెండుగా ఉంటాయి. నీటిలో 7-8 గంటలు నానబెట్టిన తరువాత తొక్క తీసి తింటే మంచిది. బాదంలు మంచివి అని అతిగా తినకూడదు. మోతాదు మించితే కొవ్వులు పెరిగిపోయి శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శరీరంలో విష తుల్యాలు పెరుగుతాయి. జీర్ణ సమస్యలు వేధిస్తాయి. ఎముకలు బలంగా ఉండటానికి కాల్షియం అవసరం అవుతుంది. అది బాదంలలో పుష్కలంగా ఉన్నందున కీళ్లనొప్పులు వంటివి రాకుండా చేస్తుంది.
బాదం తినడం వల్ల ఇంకా ప్రయోజనాలేమిటి?
రక్తంలోని చక్కెర నిల్వలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది. డయాబెటిస్ బాధితులు బాదంలను తీసుకోవడం వల్ల మెగ్నిషియం లోపాలను తగ్గించుకోవచ్చు. బాదం తినే వారిలో పాలల్లో ఉన్నట్లే కాల్షియం ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. విరిగిపోకుండా బలంగా తయారవుతాయి. బాదంలో పాస్పరస్ శాతం అధికంగా ఉండటంతో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. బాదంల వల్ల మనకు పలు రకాల ప్రయోజనాలు దక్కుతున్నాయి.