Anand Heroine : ‘ఆనంద్’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో? ఏం చేస్తుందో తెలుసా?

‘ఆనంద్’ సినిమాలో ఎంతో వయ్యారంగా ఉన్న ఈమె లావయ్యారు. అంతేకాకుండా ఫేస్ కూడా గుర్తుపట్టకుండా మారిపోయింది.

  • Written By: NARESH ENNAM
  • Published On:
Anand Heroine : ‘ఆనంద్’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో? ఏం చేస్తుందో తెలుసా?

Anand Heroine : సినిమాల్లో ఉన్నంతకాలం హీరోయిన్లకు ఉండే గుర్తింపు మాములిది కాదు. వారి నటనకు ఫిదా అయి చాలా మంది ఫ్యాన్స్ అయిపోతారు. వారి ఫొటోలను పెడుతూ సందడి చేస్తారు. వారి సినిమాలు వస్తున్నాయంటే ఫస్ట్ రోజే చూడ్డానికి రెడీ అవుతారు. కానీ ఒక్కసారిగా వారు సినిమాల నుంచి తప్పుకున్నాక.. ఇక వారి గురించి పట్టించుకోరు. కనీసం వారు ఏం చేస్తున్నారని ఎంక్వైరీ చేయరు. కానీ ఇటీవల చాలా మంది పాత హీరోయిన్లు ఇప్పుడేం చేస్తున్నారు? అని తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఓ స్టార్ హీరోయిన్ లేటేస్ట్ ఫోటోస్ చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ఆ కాలంలో ఎంతో అలరించిన ఈ ముద్దుగుమ్మ ఏమాత్రం గుర్తుపట్టకుండా మారిపోయింది. కనీసం ఈమె ఆమేనా? అన్నట్లుగా మారిపోయింది. ఇంతకీ ఆ సుందరి ఎవరో తెలుసా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తనకు ఎంత గుర్తింపు వచ్చినా.. తాను తీయబోయే సినిమాల్లో కొత్త వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. శేఖర్ కమ్ముల పరిచయం చేసిన హీరోయిన్లు ఆ తరువాత స్టార్ హీరోల పక్కన నటించారు. స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అల ఆయన ఇండస్ట్రీకి తీసుకొచ్చిన అమ్మాయిల్లో కమలినీ ముఖర్జీ ఒకరు. 2004 లో వచ్చిన ‘ఆనంద్’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కమలినీ. ఈ ఒక్క మూవీతోనే స్టార్ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పలు తెలుగు సినిమాల్లో నటించింది. అయితే 2016లో మన్యంపులి అనే సినిమాలో మెరిసిన ఈమె ఆ తరువాత కనిపించకుండా పోయింది. మరి ఇంతకాలం ఏం చేసిందో చూద్దాం..

కమిలినీ ముఖర్జీ 1984 మార్చి 4న కలకత్తాలో జన్మించింది. వాస్తవానికి కమలినీ 2004లో హిందీ చిత్రం ‘ఫిర్ మిలేంగే’లోనే నటించింది.ఎయిడ్స్ కథాంశంతో సాగిన ఈ సినిమాకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ పూర్తి చేసిన ఆమెకు కవితలు రాయడం అంటే చాలా ఇష్టం. ఈ నేపథ్యంలో తాను రాసిన Thoughts, Confusion, and Solitudeఅనే కవితను అంతర్జాతీయ పోటీల్లో ఉంచింది. దీంతో వాసింగ్టన్ లో జరిగే సదస్సుకు ఎంపికైంది. ఈ సదస్సుకు 150 మందిని ఆహ్వానించారు. ఇందులో కమలినీ ఒకరు. ఈ సదస్సులో చూసిన కమలినీని శేఖర్ కమ్ముల చూశారు. తన సినిమాలకు ఈమెను ఎంపిక చేయాలనుకున్నాడు. అలా ‘ఆనంద్’ సినిమాలో అవకాశం ఇచ్చాడు.

చివరిగా తెలుగులో ‘గోవిందుడు అందరివాడేలే’ అనే సినిమాలో కనిపించిన ఈ భామ ఆ తరువాత కనుమరుగైపోయింది. ఆ తరువాత సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో అమెరికాలోని డల్లాస్ లో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఓ వ్యాపారంతో కమలినీ బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లో కమిలినీ మెరిశారు. ఆమెను చూసి షాక్ అయ్యారు. ‘ఆనంద్’ సినిమాలో ఎంతో వయ్యారంగా ఉన్న ఈమె లావయ్యారు. అంతేకాకుండా ఫేస్ కూడా గుర్తుపట్టకుండా మారిపోయింది.

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు