Marriage : మన హిందూ వివాహ వ్యవస్థలో మనకు ఎన్నో ఆచారాలు, వ్యవహారాలు కనిపిస్తాయి. అందుకే మన సంప్రదాయాలను విదేశీయులు గౌరవిస్తారు. మనలా జీవించాలని వారు తాపత్రయ పడుతుంటే మనం మాత్రమే వారి ఆచారాలను పాటిస్తున్నాం. ఫలితంగా మన వివాహ వ్యవస్థకే మచ్చ తెస్తున్నాం. సనాతన సంప్రదాయాల్లో మన ఆచారాలను వారు ఎంతగానో ఇష్టపడుతున్నారు. మన పద్ధతులు పాటించేందుకు మొగ్గు చూపుతున్నారు. జీవితాంతం కలిసుండే భార్యాభర్తల బంధానికి వారు ఫిదా అవుతున్నారు. మన బంధంలోని మహత్యం ఏమిటో అని వారు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అక్కడ బాంధవ్యాలకు విలువ ఉండదు.
మనకు మనుస్మృతి ఉంది. మనువు అందించిన ఓ గ్రంథం. దీంతో మన వివాహ వ్యవస్థలో మనం ఎలాంటి స్త్రీలను పెళ్లి చేసుకోకూడదో స్పష్టంగా చెబుతుంది. కొన్ని లక్షణాలు ఉన్న వారిని పెళ్లి చేసుకోవడం వల్ల జీవితంలో మనకు కష్టాలు ఎదురవుతాయని ఇది తెలియజేస్తోంది. అందుకే మనం పెళ్లి చేసుకునే సమయంలోనే ఆడవారిని పరిశీలించి చేసుకోవాలని సూచిస్తోంది. ఇందుకు గాను కొన్ని పరిమితులు విధించింది. అలాంటి వారిని చేసుకుంటే మనకు జీవితంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి వివరించింది.
మనం ఎలాంటి వారిని వివాహం చేసుకుంటే జీవితం స్వర్ణమయం అవుతుందోనని చెప్పింది. కనుగుడ్లు ఎత్తుగా ఉన్న మహిళను వివాహం చేసుకోకూడదు. ఇంకా శరీరం నిండా రోమాలు ఉన్న స్త్రీని కూడా వివాహం ఆడకూడదు. స్థనద్వయం ఎత్తుగా లేని వారిని పెళ్లి చేసుకోకూడదు. నుదురు ఎత్తుగా, లావుగా ఉన్నఆడవారిని పెళ్లి చేసుకోవద్దు. శరీర ప్రమాణంలో పురుషుడితో సమానంగా ఉన్న కన్యను వివాహం చేసుకోకూడదు. ఇలాంటి లక్షణాలున్న వారిని పెళ్లి చేసుకుంటే మన జీవితం సాఫీగా సాగదు.
మనుస్మృతిలో ఇలాంటి విషయాలు ఎన్నో పొందుపరిచారు. వీటిని లెక్కలోకి తీసుకోవాలో తీసుకోకూడదో అన్నది మన మీదే ఆధార పడి ఉంటుంది. ఇవన్నీ పాటించడం వల్ల కలిగే నష్టాల గురించి చెప్పారు. కానీ అవి మన వ్యక్తిగతం. మనకు ఇష్టముంటే పాటించొచ్చు. లేదంటే వదిలేయొచ్చు. మనకు నచ్చితే చేసుకోవచ్చు. నచ్చలేదంటే ఒదిలేసుకోవచ్చు. అంతేకాని అందులో ఉండే వాటిని పాటించాలని లేదు. మన ఇష్టానుసారం మన నిర్ణయాలు తీసుకునే అధికారం మనకు ఉంది.