Pawan Kalyan- Rajamouli: తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ ఎవరంటే రాజమౌళి అని చెబుతారు. ఆయన తీసిన పన్నెండు చిత్రాలు బాక్సాఫీసు కలెక్షన్లు కురిపించాయి. ఒకటి మరొకటి ఎంతో క్రేజీ సొంతం చేసుకున్న సినిమాలే కావడం విశేషం. సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ కథలో ఆసక్తి కలిగేలా చిత్రీకరించడం జక్కన్నకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే స్టూడెండ్ నెంబర్ వన్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఓటమి ఎరగని విజేతగా నిలిచారు. ప్రతి సినిమాను డిఫరెంట్ స్టైల్ లో తెరకెక్కించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. హీరోలకు కూడా మంచి తీసుకొచ్చి వారి ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత ఆయన సొంతమే అని చెప్పొచ్చు.

Pawan Kalyan- Rajamouli
అలాంటి డైరెక్టర్ తో సినిమా అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఓ స్టార్ హీరో మాత్రం ఆయన ఇచ్చిన ఆఫర్ ను కాదనుకున్నాడు. ఫలితంగా ఓ భారీ హిట్ ను కోల్పోయాడు. దాన్ని ఓ చిన్న హీరో అందిపుచ్చుకుని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు దీంతో తరువాత బాధ పడినా ఏం ప్రయోజనం. అప్పట్లో ఇంతటి స్టార్ డైరెక్టర్ కాలేదు. ఆసమయంలో సై సినిమాను చేయాలని అన్ని సిద్ధం చేసుకున్నాక పవన్ కల్యాణ్ కు కథ చెప్పారట. కానీ కథలో కొత్తదనం ఉండటంతో పవన్ నో చెప్పారట. దీంతో కథ నితిన్ చేతిలోకి వెళ్లింది.
Also Read: Nara Lokesh: అమెరికాలో అడ్డంగా బుక్కైన ‘నారా లోకేషం’ బాగోతం..
సై ఘన విజయం సాధించడంతో నితిన్ కు హ్యాట్రిక్ విజయం లభించినట్లయింది. అప్పటికే జయం, దిల్ సినిమాలతో ఊపుమీదున్న నితిన్ కు సై ప్రాణం పోసింది. హ్యాట్రిక్ విజయాలతో నితిన్ దూసుకుపోయాడు. పవన్ కు మాత్రం నిరాశ ఎదురైంది. ఒకరికి దక్కాల్సిన విజయం మరొకరికి దక్కడం కొత్తేమీ కాదు. ఇండస్ట్రీలో ఇది మామూలే. కానీ ఓ స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ సినిమా కాదన్నందుకు బాధ పడటానికి కారణమయ్యారు. అటు డైరెక్టర్, ఇటు హీరో ఇద్దరు మంచి అవకాశాన్ని పోగొట్టుకోవడం విది వైపరీత్యమే.

Pawan Kalyan- Rajamouli
పవన్ కల్యాణ్ రాజమౌళి కాంబినేషన్ లో సై చిత్రం వస్తే అభిమానుల కోరిక తీరేది. స్టార్ డైరెక్టర్, అగ్రహీరో కలయికలో సై పెద్ద సంచలనాలే నమోదు చేసేది. కానీ పవన్ కల్యాణ్ నో చెప్పడంతో ఆ అవకాశం నితిన్ వశమై అతడికి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజమౌళితో చేసే అవకాశాన్ని దూరం చేసుకోవడంతో ఇక వారి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడనేది మాత్రం సందేహమే. సినిమా రంగంలో ఒకరి సినిమాలు మరొకరి వశం కావడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సంఘటనలు ఇలాంటివి జరగడం మామూలే.
Also Read:Brahmastra First Review: ‘బ్రహ్మాస్త్ర’ మూవీ మొట్టమొదటి రివ్యూ వచ్చేసింది