Shiv Nadar: భారత్ కు తొలి కంప్యూటర్ ను అందించిన ఈయన గురించి తెలుసా?
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రపంచంలోని అగ్ర దేశాలతో ఇండియా పోటీ పడుతుంది. అందుకు ఇక్కడున్న నిపుణులే కారణం. కొత్త కొత్త ఆవిష్కరణలతో దేశానికి ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి వారిలో శివ నాడార్ ఒకరు.

Shiv Nadar: కాలం మారుతున్న కొద్దీ కంప్యూటర్ యుగంలోకి వచ్చాం. నేటి కాలంలో ప్రతి పని కంప్యూటర్ లేనిది ముందుకు సాగడం లేదు. కిరాణం కొట్టులో సైతం బిల్లులు ఇవ్వడానికి సిస్టమ్ ను యూజ్ చేస్తున్నారు. అయితే ఒకప్పుడు వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. కానీ ఆ తరువాత సొంతంగా తయారు చేసుకునేస్థాయికి ఎదిగాం. మరి భారత్ లో మొట్టమొదటి కంప్యూటర్ తయారు చేసింది ఎవరు? ప్రపంచదేశాల సరసన భారత్ పేరును చేర్చిన ఆ వ్యక్తి గురించి.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రపంచంలోని అగ్ర దేశాలతో ఇండియా పోటీ పడుతుంది. అందుకు ఇక్కడున్న నిపుణులే కారణం. కొత్త కొత్త ఆవిష్కరణలతో దేశానికి ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి వారిలో శివ నాడార్ ఒకరు. ఈయన పేరు అందరికీ పరిచయం లేకపోవచ్చు. కానీ ఆయన కంప్యూటర్ గురించి తెలిస్తే గుర్తుపడుతారు. హిందుస్థాన్ కంప్యూటర్ లిమిటెడ్ (HCL) గురించి వినే ఉంటారు. చాలా సంస్థల్లో హెచ్ సీఎల్ కంప్యూటర్లు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఐబీఎం, యాపిల్ కంటే ముందే దేశంలో తొలి హెచ్ సీఎల్ కంప్యూటర్ ను 1978లో శివనాడార్ అందించారు. హెచ్ సీఎల్ ముందుగా హార్డ్ వేర్ కంపెనీగా ప్రారంభమై తొలిఏడాదిలోనే రూ.10 లక్షల అమ్మకాలు జరుపుకుంది. 1979 నాటికి రూ.3 కోట్ల విలువైన కంపెనీగా అవతరించింది.
దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో ఈ కంప్యూటర్ ను పరిచయం చేశారు. ముందుగా సింగపూర్ లో ఐటీ రంగానికి హెచ్ సీఎల్ కంప్యూటర్లను సరఫరా చేశారు. ఇలా అంతర్జాతీయంగా వ్యాపారభివృద్ధి చెందిన హెచ్ సీఎల్ 2022లో 11.5 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని సాధించినట్లు బ్లూమెన్ బర్గ్ తెలిపింది. 2020లో దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీగా నిలిచింది. కంపెనీ చైర్మన్ శివనాడార్ కేవలం ఐటీ రంగంలో దూసుకుపోవడమే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ ముందున్నారు. విద్య, గ్రామాణాభివృద్ధిపై దృష్టి పెట్టారు. శివనాడార్ ఫౌండేషన్ ద్వారా వివిధ సేవలను చేస్తున్నారు.
తమిళనాడులోని తత్తుకూడి జిల్లాకు చెందిన శివనాడార్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత 1967లో పూణెలో తన కెరీర్ ప్రారంభించారు. తరువాత ఐటీ రంగంలో రాణించాలని అనుకొని తన స్నేహితులు, కొంత మంది ఉద్యోగులతో కలిసి 1975లో మైక్రో కాంప్ లిమిటెడ్ అనే సొంత వెంచర్ ను ప్రారంభించారు. 1976లో ఐబీఎం ఇండియా నుంచి వెళ్లిపోయింది. దీంతో భారతదేశంలో కంప్యూటర్ అవసరాలను గుర్తించి రూ.18,700 పెట్టుబడితో హెచ్ సీఎల్ ను ఆవిష్కరించారు.
దీనిని మొదట పబ్లిక్ -ప్రైవేట్ పార్టనర్ షిప్ గా మార్చి కంపెనీలో 26 శాతం వాటాకు బదులు రూ.20 లక్షల అదనపు గ్రాంట్ తో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. దీంతో 1999లో ఈ కంపెనీ స్టార్ మార్కెట్ లో లిస్టయింది. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల సరసన ఉన్న హెచ్ సీఎల్ చైర్మన్ బాధ్యతల నుంచిశివనాడార్ 2020లో తప్పుకున్నారు. ఆ తరువాత తన ఏకైక కుమార్తె రోష్ని నాడార్ బాధ్యతలు స్వీకరించారు. తండ్రికి తగ్గ కూతురు అన్నట్లు ఆమె శివనాడార్ పేరిట ఓ విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది.
