Torn notes: మీ దగ్గర చిరిగిన నోట్లు ఉన్నాయా.. వాటిని ఛార్జీలు లేకుండా ఇలా మార్చుకోండి..
చాలా మంది నగదు వ్యవహారాలు జరిపేటప్పుడు డబ్బులను మార్చుకుంటూ ఉంటారు. అయితే పెద్ద మొత్తంలో నగదు మార్చుకున్నప్పుడు ప్రతీ నోటును పరిశీలించడం సాధ్యం కాదు.

Torn notes: రాజు అనే వ్యక్తి మార్కెట్ కు వెళ్లి కూరగాయలు, వస్తువులు కొనుగోలు చేశాడు. మార్కెట్లో ఉన్న రద్దీ తో పాటు ఇంటికి రావాలన్న తొందరలో కొనుగోళ్లలో డబ్బులు సరిగా చూసుకోలేదు. కానీ ఇంటికి వచ్చాక చిరిగిన నోట్లు కనిపించాయి. దీంతో తాను చాలా నష్టపోయానని అనుకున్నాడు. తన కర్మ అనుకొని ఆ చిరిగిన నోట్లను పాడేశాడు. అలా ఎప్పటికీ నష్టపోతూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ చిరిగిన నోట్లు పారేయాల్సిన అవసరం లేదు.వీటిని బ్యాంకులో ఇస్తే సరైన నోటు ఇస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గైడ్ లైన్స్ ప్రకారం నోటు డ్యామేజీని బట్టి బ్యాంకులు కొత్త నోటు ఇస్తాయి. అదెలాగో తెలుసుకోండి.
చాలా మంది నగదు వ్యవహారాలు జరిపేటప్పుడు డబ్బులను మార్చుకుంటూ ఉంటారు. అయితే పెద్ద మొత్తంలో నగదు మార్చుకున్నప్పుడు ప్రతీ నోటును పరిశీలించడం సాధ్యం కాదు. అంతేకాకుండా కొన్ని బెండల్స్ వచ్చినప్పుడు ఎదుటివారిపై ఉన్న నమ్మకంతో కౌంట్ చేయలేరు. అయితే వీటిలో లేదా ఇతర ప్రదేశాల్లో చాలా వరకు చిరిగిన నోట్లు వస్తుంటాయి. ఏటీఎంలల్లోనూ చిరిగిన నోట్లు వస్తున్నాయి. అలాగే ఎక్కువ సార్లు నగదు మార్పిడి జరిగిన తరువాత నోట్లు పాడైపోతాయి. ఒకప్పుడు ఇలా నోట్లు వస్తే తాము నష్టపోయామని భావించి వాటిని వదిలేశారు. కానీ ఇటువంటి నోట్లను ఇప్పుడు సులభంగా మార్చుకోవచ్చు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. నగదు నోట్లు మార్చుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. వీటిని బ్యాంకులో మార్చుకోవచ్చు. పాడైపోయిన నోట్లను సాయిల్డ్ నోట్స్ గా భావిస్తారు. ఇవి ఎక్కువసార్లు నగదు మార్పిడి జరిగిన తరువాత వాటికి మురికి పట్టి నల్లగా మారుతాయి. ఇవి మార్చుకోవాలంటే వాటిపై ఉన్న నెంబర్లు ఏ విధంగా చెడిపోకుండా ఉండాలి. చిరిగిన నోట్లు రెండు ముక్కలైనా మార్పిడి చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక వైపు 20 శాతం చిరిగిన నోట్లు మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మరీ ఎక్కువగా ముక్కలై నోటుపై ఎలాంటి సమాచారం లేకపోతే మాత్రం అవకాశం ఉండదు. ఇక కాలిన,నలిగిన నోట్లపై కూడా వాటికి సంబంధించిన నెంబర్లు ఉంటే మార్చుకోవచ్చు.
చిరిగిన లేదా పాడైపోయిన నోట్లు రోజుకు రూ.5000 వరకు మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని మార్చుకున్న వారి నుంచి బ్యాంకులు ఎటువంటి చార్జీలు వసూలు చేయరు. అయితే రూ.5000 కంటే ఎక్కువ మార్చుకోవాలనుకుంటే మాత్రం సంబంధిత ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934 లోని సెక్సన్ 58 (2), సెక్షన్ 28 ప్రకారం నోట్లపై మతపరమైన గీతలు ఉన్నా.. బాల్ పెన్ త రాతలు ఉన్నా ఆ నోట్లను బ్యాంకులో మార్చుకోవడానికి వీల్లేదు.
