
Vastu Dosh Nivaran
Vastu Dosh Nivaran: ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే ఏదీ కుదరదు. అన్ని కష్టాలే వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. నిత్యం గొడవలు జరుగుతుంటాయి. దీంతో వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ప్రతికూలతలు ఉండకుండా చూసుకోవాలి. వాస్తు దోషాలు తొలగించుకుని ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకోవాలని కోరుకుంటారు. వాస్తు దోషాలు పోవాలంటే కొన్ని పరిహారాలు పాటించాలి. కొన్ని వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ప్రయోజనాలు కలుగుతాయి. వాస్తు దోషాలు ఉన్నా ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా చేసేందుకు ఇవి ఉపకరిస్తాయి. ఈ నేపథ్యంలో వాస్తు చిట్కాలు పాటించి ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా చూసుకోవాలని ఆశిస్తుంటారు.
ఏనుగు బొమ్మతో ఎంతో లాభం
హిందూ ధర్మం ప్రకారం ఏనుగును దేవతామూర్తిగా కొలుస్తారు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకు పరోక్ష రూపమే ఏనుగు అని భావిస్తారు. ఏనుగు బొమ్మ ఇంట్లో ఉంచుకుంటే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఏనుగు బొమ్మలు ఇంట్లో ఉంచుకోవడం వల్ల సానుకూలత కలుగుతుందని చెబుతుంటారు. ఇంకా తాబేలు బొమ్మ ఉంచుకునేందుకు ఇష్టపడుతుంటారు. తాబేలులో కూడా మహావిష్ణువు ఉంటాడని ప్రతీతి. దీంతో ఇంట్లో అయినా, కార్యాలయాల్లో అయినా తాబేలు బొమ్మ ఉంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయని విశ్వసిస్తారు. తాబేలు బొమ్మ ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం.
మహాలక్ష్మి ఫొటో ఉంచుకుంటే..
ఇంట్లో శ్రీమహాలక్ష్మి ఫొటో లేదా విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల సంపద కలుగుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ప్రతి రోజు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించే వారికి కనకవర్షం కురుస్తుందని చెబుతారు. ఇంట్లో కుబేరుడి ఫొటో పెట్టి పూజ చేయడం వల్ల సంపద వస్తుంది. ఇతర సమస్యల నుంచి బయట పడటానికి అవకాశం దక్కుతుంది. ఇంట్లో నిత్యం లక్ష్మీదేవిని కొలవడం ఎంతో ఉత్తమం. దీంతో చాలా మంది లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేసి తమ సంపదను పెంచుకోవాలని కోరుకుంటారు.

Vastu Dosh Nivaran
లాఫింగ్ బుద్ధతో..
ఇంట్లో నవ్వుతున్న బుద్ధుడి బొమ్మను పెట్టుకోవడం వల్ల సిరిసంపదలకు లోటుండదు. వాస్తు మరియు ఫెంగ్ షుయ్ లో లాఫింగ్ బుద్ధ చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. లాఫింగ్ బుద్ధను ఇంటికి ఈశాన్య దిశలో పెట్టుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు. లాఫింగ్ బుద్ధ ఉన్న ఇళ్లు అనందాలకు నెలవులని వాస్తు నిపుణులు కూడా సూచిస్తున్నారు. వాస్తు దోష నివారణకు ఇంట్లో శంఖం ఉంచుకోవడం కూడా మంచిదే. శంఖం వాస్తు దోషాలను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. శంఖం విష్ణువు, లక్ష్మీదేవిలకు ప్రీతికరమైనది. ఇది ఇంట్లో ఉంచుకుంటే డబ్బుకు లోటుండదు.
వేణువును కూడా..
ఇంట్లో సంపద కలగాలంటే ఉంచుకునే వస్తువుల్లో వేణువు కూడా ఒకటి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడటానికి వేణువును ఇంటికి తూర్పు మరియు ఉత్తర దిశల్లో ఉంచుకుంటే మంచిది. లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే వేణువును ఉంచుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ క్రమంలో శ్రీకృష్ణుడికి వేణువు అంటే ఎంతో ఇష్టం. దీంతో వాస్తు దోషాలను తొలగించుకోవడంలో వేణువు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటుంది.