Vastu Dosha: భారతీయులు వాస్తుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఇల్లు కట్టుకోవాలంటే మొదట చూసేది వాస్తే. దీంతో ప్రతి వారు ఇల్లు కట్టుకునే క్రమంలో వాస్తు ప్రకారం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. స్థలం కొనుగోలు దగ్గర నుంచి ఇల్లు నిర్మించుకునే వరకు కూడా వాస్తును ప్రతి చోట ఫాలో అవుతుంటారు. గతంలో వాస్తును అంతగా పట్టించుకోకపోయినా ప్రస్తుతం మాత్రం వాస్తును ప్రధానాంశంగా తీసుకుంటున్నారు. దీంతో రోజురోజుకు వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలనే శ్రద్ధ పెరుగుతోంది. వాస్తు ప్రకారం ఏది ఎక్కడ ఉండాలో తెలుసుకుని మరీ ఏర్పాటు చేసుకుంటున్నారు.

Vastu Dosha
ఇంటి ప్రవేశ ద్వారానికి ఎదురుగా గోడ ఉన్నట్లయితే ఒంటరిగా ఉన్నట్లుగా ఉంటుంది. దీని నివారణకు అక్కడ వినాయకుడి చిత్ర పటం కాని విగ్రమం కాని ఉంచితే దోషం పోతుంది. ఇంట్లో బోరు లేదా బావి తప్పుడు దిశలో ఉంటే దానికి నైరుతి దిశలో పంచముఖ హనుమాన్ చిత్రపటం ఏర్పాటు చేస్తే సరిపోతోంది. ఇలా వాస్తు ప్రకారం చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే వాస్తు దోషాలు పోయి ఏరకమైన ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. వాస్తు దోషం ఉంటే ఎన్నో సమస్యలొస్తాయని మనవారి విశ్వాసం.
మనం ఈశాన్య దిశలో ధ్యానం చేసుకుంటే మంచిదని తలుస్తోంది. వాస్తు ప్రకారం దిశల్లో ఈశాన్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈశాన్య మార్గంలోనే నీళ్ల ట్యాంకులు ఏర్పాటు చేసుకుంటుంటారు. ఈశాన్య మార్గంలో రోడ్డు మార్గం ఉంటే అక్కడ మంచి సీనరీ ఉంచితే సరిపోతుంది. కుటుంబ సభ్యుల్లో మంచి అనుబంధాలు, ఆప్యాయతలు కలగాలంటే నైరుతి భాగంలో ఫ్యామిలీ ఫొటో అమర్చితే సరిపోతుంది. దీంతో మనకు ఎలాంటి గొడవలు రాకుండా ప్రశాంతంగా జీవితం సాగిపోతోందని తెలుస్తోంది.

Vastu Dosha
వాస్తు ప్రకారం ఉండాలంటే ఇంట్లో కిటికీలు, తలుపులు సరిసంఖ్యలో ఉండేలా చూసుకోవాలి. ఎక్కువగా డబ్బు రావాలంటే దక్షిణ దిశలో గుర్రాల ఫొటో ఏర్పాటు చేసుకోవాలి. భార్యాభర్తల మద్య బంధం బలపడాలంటే భార్య భర్తకు ఎడమ పక్కన పడుకోవాలి. ఇలా చేస్తే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈశాన్య దిశలో అక్వేరియం ఉంచుకోవాలి. దీని వల్ల పురోగంతోపాటు నెగెటివ్ ఎనర్జీ తగ్గుతుందని గుర్తుంచుకోవాలి. వాస్తు ప్రకారం చూస్తే ఎన్నో విషయాలు పాటించాలి. దీంతో మన ఇల్లు నందనవంగా మారుతుందనడంలో సందేహం లేదు.
Also Read:Toxic Fevers Rise in Telangana: బెడ్డుపై బాల్యం.. తెలంగాణలో విజృంభిస్తున్న విష జ్వరాలు