Betel Leaves : తమలపాకు మన హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఇస్తాం. దేవతారాధనలో తమలపాకుకు ఎంతో విలువ ఇస్తుంటాం. దైవకార్యాల్లోనూ దీన్ని విరివిగా ఉపయోగిస్తుంటాం. తమలపాకు లేనిదే ఏ పుణ్యకార్యం జరగదు. అందుకే తమలపాకును ఔషధంగా కూడా వాడతారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. తమలపాకులను ఉపయోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు. తమలపాకు వాడటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమలపాకు వల్ల మనకు ఎంతో లాభం జరుగుతుంది.
తమలపాకులో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది. శరీరంలో నొప్పులు, వాపులు తగ్గించడంలో సాయపడుతుంది. అజీర్తి, గ్యాస్, మలబద్ధకం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది ఉపయోగపడుతుంది. రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించే గుణం వీటిలో ఉంటుంది. తమలపాకు నమిలి తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తుంది. తమలపాకు తింటే మంచి నిద్ర పట్టేందుకు దోహదపడుతుంది. అందుకే వీటిని తీసుకోవడం వల్ల మనకు నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.
దంతాలు, చిగుళ్లకు సంబంధించిన సమస్యలు దూరం చేస్తుంది. తమలపాకులో వెల్లుల్లి, ఒక అల్లం ముక్కను కలిపి తేనెతో కలిపి పరగడుపున తీసుకుంటే రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలగించుకోవచ్చు. 21 రోజులు ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి ఆరోగ్యం కుదుట పడుతుంది. తమలపాకుతో హల్వ, లడ్డు వంటి తీపి పదార్థాలు చేసుకోవచ్చు. ఇలా తమలపాకుతో ఎన్నో రకాల ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
గొంతు నొప్పి, గొంతులో గరగర వంటి సమస్యలు ఉన్న వారు కూడా తమలపాకు రసం కొద్దిగా మింగుతుంటే ఆ సమస్య లేకుండా పోతుంది. చిన్నపిల్లల్లో ఏర్పడే గ్యాస్ సమస్యలకు కూడా ఇది చెక్ పెడుతుంది. జలుబును తగ్గిస్తుంది. లవంగం, జాజికాయ, యాలకులు, గులాబీ రేకులు, ఎండు కొబ్బరిని తగిన మోతాదులో తీసుకుంటే నిద్ర లేమి సమస్య తొలగిపోతుంది. తమలపాకుతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నందున మన ఆరోగ్యం సంరక్షించుకోవడంలో ఎంతో సాయపడుతుంది.