Good Luck: అదృష్టం మీ వెంట ఉండాలంటే ఇలా చేయండి

మన ఆచార వ్యవహారాల్లో గంధం ముఖ్యమైనది. అన్ని శుభకార్యాల్లో దీన్ని వాడతారు. మనం స్నానం చేసే నీళ్లలో గంధం వేసుకుని స్నాం చేయడం వల్ల సంపద, కీర్తి వస్తుంది.

  • Written By: Srinivas
  • Published On:
Good Luck: అదృష్టం మీ వెంట ఉండాలంటే ఇలా చేయండి

Good Luck: మనకు లక్ కలిసి రావాలని ఆశిస్తుంటాం. దీని కోసం ఎన్నో రకాల పరిహారాలు పాటిస్తుంటాం. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, కుటుంబ కలహాలు ఉండకూడదని, ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటుంటాం. దీని కోసం పలు చిట్కాలు కూడా అనుసరిస్తాం. దీంతో మనకు అన్ని శుభాలు కలగడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే మనకు మంచి ఫలితాలు రావడం ఖాయం.

మనం స్నానం చేసే నీటిలో కొన్ని రకాల పదార్థాలు వేసుకుంటే తిరుగుండదు. దీని కోసం సమస్యలు తొలగించుకోవడంలో మనకు తెలిసిన వాటిని పాటిస్తాం. స్నానం చేసే నీళ్లలో పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల మనకు ప్రతికూలతలు దూరం అవుతాయి. గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు కలుపుని స్నానం చేయడం వల్ల శుభం కలుగుతుంది.

మన ఆచార వ్యవహారాల్లో గంధం ముఖ్యమైనది. అన్ని శుభకార్యాల్లో దీన్ని వాడతారు. మనం స్నానం చేసే నీళ్లలో గంధం వేసుకుని స్నాం చేయడం వల్ల సంపద, కీర్తి వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సానుకూల శక్తి పెరుగుతుంది. మన శరీరాన్ని చల్లబరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇలా మన ఆచార వ్యవహారాల్లో వాడే పదార్థాలతో మనకు ఎంతో మేలు కలుగుతుంది.

మన సంప్రదాయంలో వేపకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వేపను దేవతతో సమానంగా కొలుస్తాం. క్రిమిసంహారకంగా పనిచేస్తుంది. మనం స్నానం చేసే నీటిలో వేప పువ్వు వేసుకుంటే శుభాలు కలుగుతాయి. ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలో వేపకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. అందుకే వేపతో మనం ఎన్నో రకాల రోగాల నుంచి లాభం పొందవచ్చు.

ఆయుర్వేదంలో తులసికి ఎంతో విలువ ఉంటుంది. స్నానం చేసే నీళ్లలో తులసి ఆకులు వేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. తులసి నూనె కూడా వేసుకుని స్నానం చేయొచ్చు. గులాబీరేకులు కూడా మనకు శుభాలు కలిగిస్తాయి. స్నానం చేసే నీటిలో వాటిని వేసుకోవడం వల్ల ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

Read Today's Latest Health news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు