Husband And Wife Relationship: సంసారం అన్నాక గిల్లికజ్జాలు కామన్.. దంపతుల మధ్య గొడవలు సహజం. అలకలు.. బుజ్జగింపులూ ఉంటాయి. ఇలా అన్నీ ఉంటేనే ఆ సంసారం సాఫీగా సాగుతుంది. అయితే కొన్ని జంటల మధ్య గొడవలు తరచూ జరుగుతూనే ఉంటాయి. అవి చినికి చినికి గాలివానలా మారతాయి. కొన్ని గొడవలు.. విడిపోవడానికీ కారణమవుతాయి. అలా కాకుండా భార్య భర్తలు ఇలా సమస్యని పరిష్కరించుకుంటే మళ్లీ ఆ జంట మద్య ప్రేమ పెరుగుతుంది. పైగా గొడవని కూడా మర్చిపోగలుగుతారు.
కమ్యూనికేషన్ చాలా ముఖ్యం..
ఏ రిలేషన్‌షిప్‌లో అయినా కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. దంపతులు ముఖ్యంగా ఓపెన్ మైండ్‌రిలేషన్ మెయింటేన్ చేయాలి. ఒకరి భావాలని ఇంకొకరు అర్థం చేసుకోవాలి. సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకు సమస్య వస్తోంది అనేది భార్య భర్తలు ఆలోచించుకోవాలి అలా సమస్యని రాకుండా చూసుకోవాలి తప్ప ఆ సమస్య నుంచి ఎక్కడెక్కడికో వెళ్లిపోయి లేనిపోని సమస్యల్ని తెచ్చి పెట్టుకోకూడదు.
రాజీ పడడం ముఖ్యం..
సంసారంలో పంతాలు పట్టింపులు ఉండకూడదు. రాజీ మార్గమే రాజమార్గం అన్నట్లు ఉండాలి. పరస్పరం పైచేయి కోసం ప్రయత్నించడం మానాలి. రాజీ పడడం అలవర్చుకోవడం చాలా ముఖ్యం. మొండి పట్టుతో కూర్చోవడం కంటే రాజీ పడిపోవడం గొడవని పరిష్కరిస్తుంది. పైగా సులభంగా మీ మధ్య ప్రేమను చిగురించేలా చేస్తుంది. అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మానసికంగా కనెక్ట్ అయితే సమస్యలు దూరం అయిపోతాయి. కొంచెం సమయం తీసుకుని సహనంతో అర్థం చేసుకోవాలి. ఒకవేళ కనుక సమస్య బాగా పెద్దదైతే కౌన్సెలింగ్ తీసుకోండి.
షేర్ చేసుకోవాలి..
సంసారంలో షేరింగ్ అచేది చాలా ముఖ్యం. భావాలతోపాటు అన్నీ పంచుకోవాలి. అప్పుడే సంసార నావ సీఫీగా సాగుతోంది. సీక్రసీ మెయింటేన్ చేస్తే అది సమస్యలకు కారణం అవుతోంది. ఇటీవల ఫొన్ల సీక్రసీ పెరుగుతోంది. ఇది మంచి పద్దతి కాదు. ఒకరి ఫోన్ ఒకరు ఇచ్చుకునేత ఓపెన్‌గా ఉండడం ముఖ్యం. అప్పుడే అనుమానాలకు తావుండదు.